
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలు, హీరోయిన్లు ఉన్నట్టుగానే.. బుల్లితెర స్టార్ యాంకర్స్ లో కూడా ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి చేసుకోని యాంకర్లు చాలామంది ఉన్నారు. ఫీమెయిల్ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ లాంటి వారు 40 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్లుగా మిగిలిపోయారు.
ఇక లేడీ యాంకర్స్ లో కూడా రష్మి గౌతమ్, శ్రీముఖి లాంటి యాంకర్లు ఇంకా పెళ్లి పీటలేక్కలేదు. రష్మి సంగతి ఏమో కానీ.. శ్రీముఖి మాత్రం తన పెళ్లిపై రీసెంట్ గా ఓ క్లారిటీ ఇచ్చేసింది. తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి.
రకరకాల టీవీ షోల ద్వారా ఆడియన్స్ కు బాగ దగ్గరైంది. టీవీ యాంకర్ గా మాత్రమే కాదు, ప్రీరిలీజ్ ఈవెంట్స్, స్పెషల్ గా ఫెస్టివల్ ఈవెంట్స్ కు కూడా యాంకర్ గా చేస్తూ.. శ్రీముఖి స్టార్ డమ్ సాధించింది. మంచి ఫాలోయింగ్ కూడా సాధించింది. ఈ ఫాలోయింత్ తోనే ఆమె బిగ్ బాస్ షోకు వెళ్లి..
చివరి వరకూ పోటీ ఇచ్చింది. రన్నర్ గా తిరిగి వచ్చింది. టెలివిజన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న శ్రీముఖి, మధ్య మధ్యలో సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. రీసెంట్ గా ఇటీవల 33 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన శ్రీముఖి ఎక్కడికి వెళ్లినా ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురౌతున్నాయి.
తాజాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీముఖి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీముఖి, “ఈ సినిమా ప్రారంభమైన సమయంలో సమంత పెళ్లి జరిగింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ
చిత్రం రిలీజై బ్లాక్బస్టర్ హిట్ సాధించిన తర్వాత నా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నాను” అని చెప్పింది. “పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్లో ఉన్నాను. సరైన వ్యక్తి దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాను” అని శ్రీముఖి తేల్చేసింది.
శ్రీముఖి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశముందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యాంకర్ గా చేతినిండా సంపాదిస్తోంది శ్రీముఖి. భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ యాంకర్ రెండు ఇళ్లు కూడా కొన్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా శ్రీముఖి కొత్త ఇంటి గృహప్రవేశం ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక శ్రీముఖి కార్ల కలెక్షన్ కూడా భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది.