
పంట రుణాల మాఫీ విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల మాఫీ పరిమితిని రూ. 75,000కు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. గతంలో ప్రకటించిన పథకంపై వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో, సన్న, చిన్న, పెద్ద అనే వ్యత్యాసం లేకుండా రైతులందరికీ ఈ ప్రయోజనాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన జూన్ 15న జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం, 2025 మే 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 మధ్య సహకార బ్యాంకుల్లో రూ. 75,000 వరకు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణంమాఫీ వర్తిస్తుంది. ఒకవేళ రుణం మొత్తం రూ. 75,000 కంటే ఎక్కువగా ఉంటే, అటువంటి వారికి రూ.
35,000 మేర మినహాయింపు లభిస్తుంది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 5,932.23 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా వేస్తున్నారు. లబ్ధిదారులలో 8.33 లక్షల మంది సన్నకారు రైతులు, 5.16 లక్షల మంది చిన్న రైతులు ఉండగా, 93 వేలకు పైగా పెద్ద రైతులు ఉన్నారు.వాస్తవానికి, మే 25న ప్రభుత్వం కేవలం సన్న, చిన్న రైతులకు మాత్రమే రూ.
50,000 వరకు రుణమాఫీని ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలైన ఏఐఏడీఎంకే, బీజేపీలతో పాటు రైతు సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రైతులందరికీ సమానంగా ప్రయోజనం కల్పించాలని డిమాండ్లు వెల్లువెత్తడంతో ప్రభుత్వం తన