
ధాన్యం దిగుబడిపైన వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. రైతు వేదికలో విత్తనాలు అందుబాటులో ఉంచాలని మార్గనిర్దేశం చేశారు. హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ధాన్యం దిగుబడిపైన వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) సూచించారు.
రైతు వేదికలో విత్తనాలు అందుబాటులో ఉంచాలని మార్గనిర్దేశం చేశారు. సన్నవడ్లు పండించే రైతుల డేటా సేకరించాలని ఆదేశించారు. ఈరోజు(మంగళవారం) హైదరాబాద్ ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 7 రకాల సన్న వడ్లను సబ్సిడీపైన ఇవ్వాలని మార్గనిర్దేశం చేశారు. భద్రాద్రి కొత్తగూడం దమ్మపేట మండలంలో ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్ట్‌ను మరింతగా వినియోగించుకోవాలని సూచించారు.
వ్యవసాయ శాఖలో సాంకేతికతను మరింత పెంచుకోవాలి.. వ్యవసాయ శాఖలో సాంకేతికతను మరింతగా పెంచుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏఐని మరింతగా వినియోగించాలని నిర్దేశించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని సాంకేతికతను పెంచుకోవాలని సూచించారు.
సీడ్స్ నుంచి కొనుగోలు వరకు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. ఆయిల్ ఫెడ్‌ను బలోపేతం చేసుకోవాలని తెలిపారు.
అన్ని వ్యవసాయ మందులకు సంబంధించి ఓ యాప్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా బుక్ చేసుకునే యూరియాను రైతు వేదిక ద్వారా పంపిణీ చేయాలని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌కు యూరియా పంపిణీ బాధ్యతను అప్పగించాలని ఆదేశించారు. యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడూ కేంద్రప్రభుత్వానికి లేఖలు రాయాలని ఆదేశించారు.
రేవంత్‌రెడ్డి సూచించారు. ఎరువుల పరిస్థితిపైన అన్ని పార్టీల ఎంపీలతో ఓ సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించాలని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి మాట్లాడండి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణను ఎగుమతి బియ్యం హబ్‌గా తీర్చిదిద్దుతాం: మల్లు భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయిన ఎరువులు మొత్తం తెలంగాణకే ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం