
శ్రీలంకలో ముక్కోణపు సిరీస్ ఆడుతున్న భారత- ఎ జట్టులోకి కొత్త ప్లేయర్ చేరనున్నాడు. గాయపడిన యధ్వీర్ సింగ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు అశోక్ శర్మను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు వెంటనే శ్రీలంకకు బయల్దేరనున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ వర్మకు జాక్‌పాట్ తగిలింది. శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం టీమిండియా-ఎ జట్టు నుంచి పిలుపు వచ్చింది. గాయపడిన యద్వీర్ స్థానంలో అశోక్ ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
దీంతో అతడు వెంటనే శ్రీలంకకు బయల్దేరనున్నాడు. ఇప్పటికే రెండు ఓటములతో ఫైనల్ అవకాశాలను భారత్-ఎ జట్టు సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో జట్టులోకి అశోక్ వర్మ ఎంట్రీ బలం చేకూరుస్తుందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బుధవారం(జూన్ 17న) అప్గానిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అశోక్ శర్మ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అశోక్ వర్మ ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్లో అశోక్ వర్మ గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం విశేషం. ఐపీఎల్ 2026లో 10.85 సగటుతో ధారాళంగా పరుగులు ఇచ్చి.. కేవలం 6 వికెట్లే తీశాడు. అతడి వేగవంతమైన బౌలింగ్ కారణంగానే ఇవాళ భారత్-ఏ జట్టులోకి పిలుపు వచ్చేలా చేసిందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక యుధ్వీర్ సింగ్ విషయానికి వస్తే.. అతడు భుజం గాయంతో టీమిండియా-ఎ ఆడిన మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ వేయడంలో ఇబ్బంది పడిన యధ్వీర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అశోక్ శర్మకు చోటు లభించింది.
గాయంతో బాధపడుతున్న యుధ్వీర్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు రావాలని బీసీసీఐ తెలిపింది. తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ బదోని, నిషాంత్ సింధు, సూర్యాంశ్
షెడ్జే, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుషాగ్రా, అర్ష్ ఖన్బ్, విప్రరాజ్ నిగమ్, విప్రారాజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అశోక్ శర్మ.
శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై ఐసీసీ చర్యలు తప్పదా?
మెస్సి కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది: అర్జెంటీనా కోచ్