
LS Speaker Decision : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు తాము ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఎన్సీపీఐ) లో విలీనమయ్యామని ప్రకటించడం రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తమను ప్రత్యేక వర్గంగా గుర్తించి, లోక్సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని సదరు తిరుగుబాటు ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా విజ్ఞప్తి చేశారు.
దీంతో ఈ వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తిరుగుబాటు చేసిన 20 మంది టీఎంసీ ఎంపీల స్థితిగతులను, వారి విలీన అభ్యర్థనను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికారిక టీఎంసీ వర్గం మరియు తిరుగుబాటు వర్గం.. ఈ రెండు పక్షాల వాదనలను పూర్తిగా విన్న తర్వాతే స్పీకర్ ఒక నిర్ణయానికి రానున్నారు. ఏకపక్షంగా కాకుండా నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగనుంది. Read Also: Air India, IndiGo: ATF పన్ను పెంపు ప్రభావం ఎయిర్ ఇండియా, ఇండిగో టికెట్లుపై పడనున్నదా?
ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు లోక్సభ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే తదుపరి చర్యలు ప్రారంభించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికారిక టీఎంసీ ఎంపీల బృందాన్ని చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ అధికారికంగా ఈ-మెయిల్ పంపింది. పార్టీ అధికారిక నాయకత్వంతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే విలీనంపై స్పీకర్ ఓం బిర్లా తన తుది నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
టీఎంసీ లోక్సభ సభ్యుల బృందంలో అధికారికంగా చీలిక ఏర్పడిన తరుణంలో ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. AP Weather update: నేడు ఏపీకి భారీ వర్ష సూచన గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Smriti Mandhana: ప్రతిష్ఠాత్మక ‘టైమ్ మ్యాగజైన్’ జాబితాలో క్రికెటర్ స్మృతి మంధాన!
Cough Syrup Rules: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. మెడికల్ షాపులకు ప్రభుత్వం గట్టి వార్నింగ్!
Karnataka CM: AI టౌన్షిప్ ప్రాజెక్టును సమర్థించుకున్న డి.కె. శివకుమార్
Ayodhya Ram Mandir: అయోధ్య రాముడికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నైవేద్యం!
Air India, IndiGo: ATF పన్ను పెంపు ప్రభావం ఎయిర్ ఇండియా, ఇండిగో టికెట్లుపై పడనున్నదా?
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని