
Air India, IndiGo : మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా ఇంధన లభ్యతను నిర్ధారించడానికి, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల చమురు ఎగుమతిదారులు అక్రమ ప్రయోజనం పొందకుండా నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF-విమాన ఇంధనం) ఎగుమతులపై విండ్‌ఫాల్ గెయిన్స్ పన్నును (Windfall Gains Tax) పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది.
అయితే, పెట్రోల్‌పై ఉన్న పన్నును మాత్రం యథాతథంగా కొనసాగించింది. జూన్ 16 నుండి ప్రారంభమయ్యే రాబోయే పక్షం రోజుల (15 రోజులు) కాలానికి ఈ సరికొత్త సుంకాల రేట్లు అమల్లోకి రానున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం..
ఇంధన ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (SAED) సవరించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డీజిల్ ఎగుమతిపై ప్రస్తుతం ఉన్న పన్ను రేటు లీటరుకు రూ. 13.5 నుండి రూ. 14కి పెరిగింది. Read Also: Viksit Bharat Yuva Parliament 2026: జాతీయ వేదికపై ముగ్గురు తెలంగాణ యువతులు ఎంపిక!
అలాగే విమాన ఇంధనమైన ఏటీఎఫ్ ఎగుమతిపై సుంకం లీటరుకు రూ. 9.5 నుండి ఏకంగా రూ. 12.5కి పెంచబడింది. మరోవైపు, పెట్రోల్ ఎగుమతులపై ఉన్న సుంకం రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా, దానిని లీటరుకు రూ. 1.5 గానే యథాతథంగా కొనసాగించారు. విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనాలపైనే ఈ అదనపు పన్నుల భారం పడనుండ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులు, దానికి ప్రతిగా జరిగిన భారీ ప్రతీకార చర్యల కారణంగా మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది.
దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో, భారతీయ చమురు కంపెనీలు దేశీయ అవసరాలను పక్కనబెట్టి, విదేశాల్లో లభించే అధిక ధరల కోసం ఇంధనాన్ని భారీగా ఎగుమతి చేయకుండా నిరుత్సాహపరచడమే
ఈ పన్ను యొక్క ముఖ్య ఉద్దేశ్యం. జెట్ ఇంధన (ATF) ధరల పెంపుతో పాటు ప్రభుత్వం తీసుకున్న తాజా విండ్‌ఫాల్ పన్ను నిర్ణయం, నూతన ధరల స్థిరీకరణ పథకం దేశీయ విమానయాన రంగంపై భిన్నమైన ప్రభావాలను చూపబోతున్నాయి.
Mukesh Ambani: బద్రీనాథ్ క్షేత్రానికి రూ.10 కోట్ల విరాళం ప్రకటించిన ముఖేశ్ అంబానీ
Hayathnagar Govardhan Suicide Case: సెల్ఫీ వీడియో ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. 2 నెలల తర్వాత దొరికిన పసికందు ఆచూకీ!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Viksit Bharat Yuva Parliament 2026: జాతీయ వేదికపై ముగ్గురు తెలంగాణ యువతులు ఎంపిక!
US H-1B, H-4: H-1B, H-4 వీసా స్లాట్లు భారీగా విడుదలతో భారతీయల్లో ఆనందం
CM Vijay: సీఎం విజయ్ పుట్టినరోజున కొత్త రేషన్ కార్డుల పంపిణీ
Ayodhya Ram Mandir Funds: రామమందిర నిధుల దుర్వినియోగం నిజమేనా?
Maharashtra crime: నాగ్‌పూర్‌లో ఘోరం.. ఐఏఎఫ్ అధికారి భార్యపై అఘాయిత్యం