
పన్ను పెంపుప్రభావం ఎయిర్ ఇండియా, ఇండిగో టికెట్లుపై పడనున్నదా
Air India, IndiGo : మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా ఇంధన లభ్యతను నిర్ధారించడానికి, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల చమురు ఎగుమతిదారులు అక్రమ ప్రయోజనం పొందకుండా నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF-విమాన ఇంధనం) ఎగుమతులపై విండ్‌ఫాల్ గెయిన్స్ పన్నును (Windfall Gains Tax) పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. అయితే, పెట్రోల్‌పై ఉన్న పన్నును మాత్రం యథాతథంగా కొనసాగించింది. జూన్ 16 నుండి ప్రారంభమయ్యే రాబోయే పక్షం రోజుల (15 రోజులు) కాలానికి ఈ సరికొత్త సుంకాల రేట్లు అమల్లోకి రానున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇంధన ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (SAED) సవరించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డీజిల్ ఎగుమతిపై ప్రస్తుతం ఉన్న పన్ను రేటు లీటరుకు రూ. 13.5 నుండి రూ. 14కి పెరిగింది. Read Also: Viksit Bharat Yuva Parliament 2026: జాతీయ వేదికపై ముగ్గురు తెలంగాణ యువతులు ఎంపిక! అలాగే విమాన ఇంధనమైన ఏటీఎఫ్ ఎగుమతిపై సుంకం లీటరుకు రూ. 9.5 నుండి ఏకంగా రూ. 12.5కి పెంచబడింది. మరోవైపు, పెట్రోల్ ఎగుమతులపై ఉన్న సుంకం రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా, దానిని లీటరుకు రూ. 1.5 గానే యథాతథంగా కొనసాగించారు. విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనాలపైనే ఈ అదనపు పన్నుల భారం పడనుండ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులు, దానికి ప్రతిగా జరిగిన భారీ ప్రతీకార చర్యల కారణంగా మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో, భారతీయ చమురు కంపెనీలు దేశీయ అవసరాలను పక్కనబెట్టి, విదేశాల్లో లభించే అధిక ధరల కోసం ఇంధనాన్ని భారీగా ఎగుమతి చేయకుండా నిరుత్సాహపరచడమే