
హైదరాబాద్ నగర విస్తరణ మరియు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అభివృద్ధి పనులను చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉప్పల్ వద్ద భారీ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణం చేయనున్నారు. దీంతో ఉప్పల్ స్కైవాక్ కూడా ప్రభావితం కానుంది.
ప్రస్తుతం ఉప్పల్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న భారీ ఎలివేటెడ్ కారిడార్ పనుల కోసం స్కైవాక్ యొక్క ఒక భాగాన్ని తాత్కాలికంగా తొలగించాల్సి వస్తోంది.ఉప్పల్ లో వరంగల్ జాతీయ రహదారి వైపు ఉన్న స్కైవాక్ తొలగింపు ఈ కారిడార్ మెట్రో రైలు మార్గాన్ని దాటుతూ గరిష్టంగా 75 అడుగుల సుమారు 23 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పనుల్లో వరంగల్ జాతీయ రహదారి వైపు ఉన్న స్కైవాక్ యొక్క సుమారు 17 మీటర్ల పొడవు భాగాన్ని పిల్లర్ల నిర్మాణం కోసం తొలగించనున్నారు.స్కైవాక్ తొలగింపు, పునర్నిర్మాణం కోసం క్షేత్ర స్థాయి అధ్యయనంఈ తొలగింపు మరియు తర్వాత పునర్నిర్మాణం కోసం అయ్యే ఖర్చును అంచనా వేయడానికి ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ ఈరోజు క్షేత్ర స్థాయి అధ్యయనం చేయనుంది.
ఈ ఖర్చును మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.అయితే దీనిని కూల్చివేసి మళ్ళీ నిర్మించటం స్కైవాక్ ను వినియోగించుకునే పాదచారులకు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది.రూ.25 కోట్ల వ్యయంతో ఉప్పల్ స్కైవాక్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ ఒకప్పుడు పాదచారులు మరియు వాహనదారులకు రోడ్డు దాటాలంటే ప్రాణాపాయకరంగా ఉండేది. ఈ సమస్యకు పరిష్కారంగా 2020లో ప్రారంభమై 2023లో పూర్తి చేసిన ఉప్పల్ స్కైవాక్ రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించబడింది.
660 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో, 8 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు మరియు 6 మెట్ల మార్గాలతో ఈ స్కైవాక్ పాదచారులకు ఎంతో సౌకర్యం కల్పించింది.కొత్త ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంభూమి నుంచి సుమారు 6 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ నిర్మాణం ప్రజల మధ్య బాగా ప్రాచుర్యం
పొందింది. అయితే, నగర అభివృద్ధి అవసరాలు మారుతున్న నేపథ్యంలో కొత్త ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అనివార్యమైంది. ఈ కారిడార్ ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా వస్తూ స్కైవాక్ మరియు మెట్రో లైన్‌ను దాటాల్సి ఉంది. దీంతో పిల్లర్ల నిర్మాణం కోసం స్కైవాక్ భాగం తొలగింపు తప్పనిసరి అయింది.వరంగల్ రహదారి వైపు ప్రజలకు ఇబ్బంది ఈ పనులు జరుగుతున్న కాలంలో వరంగల్ రహదారి వైపు ఉన్న స్కైవాక్ మార్గం కొన్ని నెలల పాటు మూసివేయబడుతుంది. దీని వల్ల కాలినడకన వెళ్లే ప్రజలు కొంత ఇబ్బంది పడవలసి ఉంటుంది. అయినప్పటికీ, పనులు పూర్తయ్యాక స్కైవాక్‌ను మళ్లీ యథాస్థానంలో అమర్చడం ద్వారా సౌకర్యాలు పునరుద్ధరించబడతాయి.జూన్ 19నుండి భారీ వర్షాలు.. ఈ జిల్లాలలో ఎండలు.. ఐఎండీ అలెర్ట్!ప్రజలు తాత్కాలిక అసౌకర్యాలను ఓపికగా భరించాల్సిందే ఈ అభివృద్ధి పనులు హైదరాబాద్ తూర్పు భాగంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తాత్కాలిక అసౌకర్యాలను ఓపికగా భరించి, ప్రత్యామ్నాయ మార్గాలను వాడాలని సూచించారు. హైదరాబాద్ నగరం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మారుతున్న ఈ రకమైన అభివృద్ధి పనులు నగర రూపురేఖలను మార్చేస్తాయని భావిస్తున్నారు.