
విజయవాడ మార్గంలో రైళ్లు రద్దు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి. మూడోలైను పనుల కారణంగా నిర్ణయం. Trains Cancelled: దక్షిణమధ్య రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం అందించింది. కాజీపేట-కొండపల్లి సెక్షన్ పరిధిలోని డోర్నకల్-గుండ్రతిమడుగు మార్గంలో మూడోలైను నిర్మాణ పనులు (నాన్-ఇంటర్లాకింగ్) చేపట్టనున్నారు.
ఈ కారణంగా సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో నడిచే 18 రైళ్లను ఆగస్టు 15 నుంచి 19 వరకు రద్దు (Trains Cancelled)చేస్తున్నట్లు రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ ప్రకటించారు. రద్దయిన వాటిలో కాజీపేట, విజయవాడ, భద్రాచలం, గుంటూరు, మణుగూరు, విశాఖపట్నం, కాకినాడ, లింగంపల్లి రూట్లలో నడిచే ముఖ్యమైన రైళ్లు ఉన్నాయి.
Telangana Public School: సర్కార్ బడుల్లో సరికొత్త విద్యా విప్లవం.. ఆరుట్లలో తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’.. రేపే ప్రారంభోత్సవం మరోవైపు ఇదే మార్గంలో నడిచే మరో 4 రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, 8 రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారిమళ్లించారు.
అలాగే ప్రయాణికుల రద్దీని బట్టి మరో 10 రైళ్లను 60 నుంచి 75 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచేలా రీషెడ్యూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు
.