
Karnataka Ex Army Murder: డబ్బుపై అత్యాశ, వివాహేతర సంబంధం కలిసి ఒక ఆర్మీ మాజీ జవానును అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్న ఘోర కలియుగ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ (Life Insurance) పాలసీ సొమ్మును కాజేయడానికి, ఒక భార్య తన ప్రియుడితో కలిసి కన్నబిడ్డల తండ్రిని, దేశాన్ని కాపాడిన మాజీ సైనికుడిని ఆసుపత్రి బెడ్‌పైనే సెలైన్‌లో విషం కలిపి హతమార్చింది.
సంచలనం సృష్టించిన ఈ ‘సెలైన్ మర్డర్’ మిస్టరీని కర్ణాటకలోని బెళగావి జిల్లా యమకనమరడి పోలీసులు ఛేదించారు. ఈ దారుణంలో భార్య, ఆమె ప్రియుడితో పాటు వారికి సహకరించిన ప్రభుత్వ ల్యాబ్ అధికారులు, నకిలీ డాక్టర్ సహా మొత్తం తొమ్మిది మందిని (9 Members) అరెస్టు చేసినట్లు బెళగావి ఎస్పీ భీమా శంకర గుళేద్ అధికారికంగా వెల్లడించారు.
Read Also :Bengaluru Crime: ప్రియురాలి గొంతుకోసి చంపేసిన ప్రియుడు.. పెళ్లి వివాదమే కారణమా? మృతుడు సందీప్ కలగౌడ మంజరగి (46) ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికుడు. ఆయన భార్య సుమకు పుండలీక డొంబర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
సందీప్ పేరు మీద రూ. 2 కోట్ల భారీ ఇన్సూరెన్స్ అమౌంట్ ఉండటంతో, అతడిని వదిలించుకుంటే డబ్బుతో పాటు తామిద్దరం హ్యాపీగా ఉండొచ్చని సుమ-పుండలీక స్కెచ్ వేశారు. మార్చి 13న సందీప్ మంజరగి ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి హుక్కేరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
ప్రమాదం చిన్నదే కావడంతో ఆయన కోలుకుంటున్నారు. ఇదే తమకు సరైన అవకాశమని భావించిన భార్య సుమ, ప్రియుడు పుండలీకలు ఆసుపత్రి సిబ్బంది కళ్లుగప్పి మార్చి 15న సందీప్‌కు ఎక్కుతున్న సెలైన్ బాటిల్లో తీవ్రమైన విషాన్ని ఇంజెక్ట్ చేశారు. దాంతో కొద్దిసేపటికే సందీప్ ప్రాణాలు విడిచాడు.
రోడ్డు ప్రమాదంలో తగిలిన గాయాల వల్లే సందీప్ చనిపోయాడని నమ్మించి, హడావుడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే, సందీప్
మరణంపై అతని సోదరుడికి బలమైన అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు మొదట భార్య సుమ, ప్రియుడు పుండలీకలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నారు. అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వీరు మెడికల్ రిపోర్టులను, ఫోరెన్సిక్ రిపోర్టులను తారుమారు చేసేందుకు ఏకంగా ప్రభుత్వ అధికారులను లంచాలతో లోబరుచుకున్నట్లు విచారణలో తేలింది.
పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల ముఠా వివరాలు
పోస్ట్‌మార్టం రిపోర్టులో విషం అనే విషయం బయటకు రాకుండా ఉండేందుకు, ల్యాబ్ టెస్టులను తప్పుదోవ పట్టించేందుకు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు, క్లర్కులు నిందితుల నుంచి భారీగా డబ్బులు తీసుకుని తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు.
Pakistan Aircraft Crash: పాకిస్థాన్ వైమానిక దళంలో విషాదం.. శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
Telangana weather update: పగలు మండుటెండలు.. రాత్రి కుండపోత వర్షాలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Sanchita Ugale Last Video: ఇన్‌స్టాగ్రామ్‌లో సంచిత ఉగాలే చివరి వీడియో.. అంతలోనే ఏం జరిగింది?
Chittoor incident: పుంగనూరులో వజ్రాల కోసం గణేష్ విగ్రహం ధ్వంసం
Bengaluru Crime: ప్రియురాలి గొంతుకోసి చంపేసిన ప్రియుడు.. పెళ్లి వివాదమే కారణమా?
Marius Borg Hoiby: నార్వే ప్రిన్స్ సవతి కుమారుడికి 4 ఏళ్ల జైలు శిక్ష
Madhya Pradesh Crime: భార్య మెడకు ఇనుప గొలుసు వేసి పైశాచిక దాడి.. ఓ భర్త వికృత చేష్టలు
Indian man arrested in Nepal : లోదుస్తుల్లో మాదకద్రవ్యాలు దాచిన భారతీయుడు నేపాల్‌లో అరెస్టు