
అమరావతి: కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఒక రోజు పర్యటనలో భాగంగా విజయవాడ చేరుకున్న ఆయన.. నగరంలోని వాజ్‌పేయీ పార్కులో స్వచ్ఛభారత్‌లో భాగంగా చీపురు పట్టి చెత్త ఊడ్చారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి పార్కులో మొక్కలు నాటారు. అనంతరం పార్క్‌కు వచ్చిన వాకర్స్‌తో ముచ్చటించారు. దేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా.. నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచిపోయారన్నారు. 2014కు ముందు భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్షీణ దశలో ఉందని..
మోదీ ప్రధాని అయ్యాక అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్ధగా భారత్ రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జరిగిన రెండో దేశం భారత్ అని వివరించారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు 8 రెట్లు పెరిగాయి. అమరావతి కోసం హడ్కో నుంచీ రూ.11వేల కోట్లు ఇచ్చామన్న జోషి..
అమరావతి కనెక్ట్ చేస్తూ ప్రత్యేక రైల్వే లైన్ కోసం నిధులు సమకూర్చినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర అబివృద్ధి కోసం చంద్రబాబు, పవన్, మాధవ్ కలిసి బాగా పని చేస్తున్నారని ప్రహ్లాద్ జోషి కితాబిచ్చారు. రాజధాని అమరావతికి రోడ్, రైల్వే కనెక్టివిటీ పెంచుతున్నామని వెల్లడించారు.
అమరావతి అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.