
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Karnataka Ex Soldier Killed By Wife: బెళగావిలో రెండు కోట్ల బీమా కోసం భర్తను హత్య చేసిన భార్య కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మూడు నెలల క్రితమే జరిగినట్లు సమాచారం. 2026 మార్చి 13న మాజీ సైనికుడు సందీప్ కలగౌడ ఒక ప్రమాదానికి గురయ్యారు.
ఆయన ఆసుపత్రిలో చేరిన రెండో రోజే గుండెపోటుతో మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే, మృతుడిపై బీమా చేయించినట్లు తెలిసింది. అదే అసలు విషయం బయటపెట్టింది. ఈ మాజీ సైనికుడి మరణానంతరం భార్య సుమ ప్రియుడు పుండలిక్, ఆ బీమా మొత్తంలో సగం కావాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు.
ఆమె నిరాకరించడంతో, ఈ హత్య విషయం పోలీసులకు తెలియజేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, విచారించగా మృతుడి భార్య నేరాన్ని అంగీకరించింది. అసలు కథ ఏమిటంటే... పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు సందీప్, సుమకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
సందీప్ 17 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేసి, మూడు ఏళ్ల క్రితమే పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ఒక రైస్ షాపును నడుపుతున్నారు. ఈ సమయంలోనే సుమకు పుండలిక్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. తమ బంధానికి అడ్డుగా ఉన్న సందీప్‌ను ఎలాగైనా అంతం చేయాలని ఇద్దరూ ప్లాన్ చేశారు.
అతను చనిపోతే రెండు కోట్లు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ హత్యకు కుట్ర పన్నారు. మార్చి 13న సందీప్ ఒక చిన్న రోడ్డు ప్రమాదానికి గురవ్వగానే, తమ ప్లాన్ అమలు చేశారు. ప్రైవేట్
ఆస్పత్రిలో ఆయనకు సెలైన్ ఎక్కించే సమయంలో అందులో విషం కలిపారు, తద్వారా సందీప్ ప్రాణాలు కోల్పోయారు.
అయితే, మొదట పోస్టుమార్టం సమయంలో సుమ కంగారుపడి తన తల్లికి నిజం చెప్పేసింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న తమ పరిచయస్తుల ద్వారా ఎఫ్ఎస్ఎల్ (FSL) నివేదికను మార్చాలని నిర్ణయించుకున్నారు. నివేదికలో మరణానికి కారణం గుండెపోటు అని రాయడం కోసం వారికి మూడు లక్షల రూపాయలకు పైగా లంచం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసును మూసివేశారు.
వీడియో వైరల్.. కానీ, బీమా డబ్బులు పంచుకునే విషయంలో సుమ, పుండలిక్ మధ్య వివాదం తలెత్తింది. ఈ గొడవ కారణంగా పుండలిక్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. దీనిని బట్టి పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, ఎఫ్ఎస్ఎల్ నివేదికను పునః పరిశీలించగా అసలు నిజం బయటపడింది. ఈ కేసులో ఆమె ప్రియుడు పుండలిక్‌తో పాటు, ఎఫ్ఎస్ఎల్ అధికారి నాగరాజ్, మరో 80 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.