
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం కూడా గరిష్ఠ స్థాయుల్లోనే స్థిరంగా కొనసాగాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడటంతో పాటు ఇతర స్థూల ఆర్థిక అనిశ్చితులు నెలకొనడంతో బులియన్ మార్కెట్ పటిష్ఠంగా ఉంది.అమెరికా-ఇరాన్ మధ్య శత్రుత్వానికి ముగింపు పలుకుతూ కుదిరిన ప్రాథమిక ఒప్పందం నేపథ్యంలో, అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో పసిడి ధర సోమవారం 2 శాతానికి పైగా వృద్ధి చెందింది.
ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 4,300 డాలర్ల సమీపంలో ట్రేడ్ అవుతోంది. ఈ ఒప్పందం కారణంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, డాలర్ విలువ క్షీణించడం బంగారం ధరలకు ఊతమిచ్చింది.అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది.
‘గుడ్ రిటర్న్స్’ వెబ్సైట్ సమాచారం ప్రకారం, ఈ రోజు (16వ తేదీ) ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,51,540 వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,38,910 వద్ద కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లోనూ ధరలు ఇంచుమించు ఇదే స్థాయిలో ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా మేలిమి బంగారం ధర ఏకంగా రూ. 2,450 మేర పెరిగిన సంగతి తెలిసిందే.దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో రూ. 1,53,500, ముంబైలో రూ. 1,51,540, ఢిల్లీలో రూ. 1,51,690, కోల్కతా మరియు బెంగళూరు నగరాల్లో రూ. 1,51,540గా