
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Dangerous Reheated Foods: తినగా మిగిలిపోయిన వంటలను ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకొని.. ఆ తర్వాత రోజు మళ్లీ వేడి చేసుకుని తినడం చాలా మంది సౌకర్యంగా ఫీల్ అవుతారు. కానీ ప్రతి ఆహారం అలా వేడి చేయడానికి కుదరదు. కొన్ని పదార్థాలను పదేపదే వేడి చేసి తినడం వల్ల విషంగా మారే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా జీర్ణ సమస్యలు రావొచ్చు. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అవ్వొచ్చు. కాబట్టి ఏవి తిరిగి వేడి చేయడం మంచిది కాదో తెలుసుకుని జాగ్రత్తగా ఉండడం అవసరం. మరి ఏఏ ఆహార పదార్థాలను వేడి చేసుకొని తినడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ ఏ పదార్థాలను వేడి చేసుకొని తినకూడదంటే..? 1. గుడ్డు ఉడికించిన గుడ్లను లేదా వేయించిన గుడ్లను మళ్లీ మళ్లీ హీట్ చేయకూడదు. గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువ. వండిన ఎగ్ కర్రీని మళ్లీ వేడిచేస్తే వాటి ప్రోటీన్ నిర్మాణం దెబ్బతిని.. అది విషపూరితం కావచ్చు.
దీంతో తీవ్రమైన కడుపునొప్పి, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. గుడ్లను మళ్లీ వేడిచేస్తే రబ్బరులా మారి రుచిని కోల్పోతాయి. అందుకే గుడ్లను ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వండుకోవడం మంచిది. 2. మాంసం చికెన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ చికెన్‌ను వేడి చేయడం వల్ల దానిలోని ప్రోటీన్లు తగ్గిపోతాయి.
అలా వేడి చేసుకొని తినడం వల్ల ఫుడ్ సరిగ్గా జీర్ణం కాక కడుపు ఉబ్బరం, అజీర్తికి దారితీస్తుంది. చికెన్‌ను ఫ్రిజ్‌లో పెడితే బ్యాక్టీరియా పెరుగుతుంది. వండిన వెంటనే తినడం మంచిది. 3. అన్నం మిగిలిపోయిన అన్నాన్ని మరుసటి రోజు వేడి చేసి తినడం పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.
ఉంచితే, అందులో 'బాసిల్లస్ సెరియస్' అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీన్ని మళ్లీ వేడి చేసినా, ఆ బ్యాక్టీరియా విషపదార్థాలు రిలీజ్ చేస్తుంది. ఇది వాంతులు, మోషన్స్‌కు కారణమవుతుంది. అందుకే అన్నాన్ని పదేపదే వేడి చేసి తినకూడదు.
4. మష్రూమ్స్ మష్రూమ్స్‌ను వండిన వెంటనే తినడం ఉత్తమం. వీటిలో ప్రోటీన్లు, ఎంజైమ్‌లు ఉంటాయి. వీటిని మళ్లీ వేడి చేసినప్పుడు అవి విచ్ఛిన్నమవుతాయి. ఇది గుండె, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. సరైన ఉష్ణోగ్రతలో మళ్లీ వేడి చేయకపోతే, పుట్టగొడుగులలోని ప్రోటీన్లు విషపూరితంగా మారే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి మష్రూమ్స్‌ను మళ్లీ వేడి చేసి తినకూడదు.
5. ఆకుకూరలు ఆకుకూరల్లో సహజంగానే నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరలను మళ్లీ మళ్లీ వేడి చేసినప్పుడు ఈ నైట్రేట్లు.. నైట్రైట్లుగా మారతాయి. ఇవి శరీరానికి విషపూరితం. క్యాన్సర్ కణాలను ప్రేరేపించే కారకాలుగా మారొచ్చు. అంతేకాదు, వాటిలోని ప్రోటీన్లు విచ్ఛిన్నమై ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఆకుకూరల రుచి, పోషకాలను కాపాడుకోవాలంటే.. తాజాగా కొని, అప్పటికప్పుడు వండుకుని తినడమే ఉత్తమం.
6. బంగాళాదుంపలు బంగాళదుంపలను వండిన తర్వాత గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచి.. ఆ తర్వాత వేడి చేయకూడదు. ఇలా చేస్తే 'బోటులిజం' అంటే ఆహారం విషమవ్వడానికి కారణమయ్యే అరుదైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. వేడి చేసినప్పటికీ, ఈ బ్యాక్టీరియా విషం పోదు. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా ఆహారాన్ని విషపూరితం చేసి, వ్యాధులు వ్యాపించడానికి కారణమవుతుంది.
7. వంట నూనె ఒకసారి వాడిన నూనెను మళ్లీ వేడి చేసి వాడటం చాలా ప్రమాదకరం. నూనెను మళ్లీ వేడి చేసినప్పుడు, దాని సాంద్రత మారి 'ట్రాన్స్ ఫ్యాట్' అనే విషపూరిత పొగ ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్, గుండె జబ్బులకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ వంటి తక్కువ స్మోక్ పాయింట్ ఉన్న నూనెలను మళ్లీ వేడి చేస్తే, అవి హానికరమైన సమ్మేళనాలను సృష్టిస్తాయి. దీనివల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపు వంటి సమస్యలు వస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
అన్నాన్ని గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు