
అమెరికా, ఇరాన్ల మధ్య అత్యంత కీలకమైన దౌత్య ఒప్పందం త్వరలో జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 19న ఈ చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. దీనివల్ల వ్యూహాత్మకంగా ప్రపంచ రవాణా రంగానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన హోర్ముజ్ జలసంధి రవాణా మార్గం వెంటనే తెరుచుకుంటుందని, దశాబ్దాల శత్రుత్వానికి ముగింపు పలుకుతూ నూతన దౌత్య సంబంధాలు ఊపందుకుంటాయని ట్రంప్ వివరించారు.ఈ పరిణామాల మధ్య ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమంపై కీలకమైన ప్రకటన చేశారు.
భవిష్యత్తులో అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయబోమని ఆ దేశం అంగీకరించిందని వెల్లడించారు. రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్కు సుమారు 300 మిలియన్ డాలర్ల నిధులు అమెరికాకు అందుతాయనే వార్తలను కూడా తోసిపుచ్చారు.
దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు.14 షరతులతో కూడిన ఈ ఒప్పందంపై ట్రంప్ స్పందించారు. తాము ఎప్పటికీ అణ్వాయుధాన్ని సమకూర్చుకోబోమని ఇరాన్ అంగీకరించిందని పేర్కొన్నారు. అలాగే అమెరికా ఇరాన్కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందంటూ వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని, ఇది డెమొక్రాట్లు సృష్టించిన ఫేక్ న్యూస్ గా కొట్టిపారేశారు.
ఇరాన్ తో కుదిరిన శాంతి ఒప్పందాల ప్రకారమే ముందుకు వెళ్తామనే విషయాన్ని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారీ పోస్ట్ ద్వారా.ఇరాన్ తన వాగ్దానాలను నిలబెట్టుకుంటే ఆ దేశానికి జప్తు చేసిన నిధులను విడుదల చేయడం సహా పునర్నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు అందే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నిధులను అమెరికా సమకూర్చుతుందనే వాదనలు సైతం లేకపోలేదు.
ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను అటు ఇరాన్ గానీ, ఇటు అమెరికా గానీ ఇంకా బహిర్గతం చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫలితంగా కొన్ని షరతులపై పీటముడి పడే అవకాశం ఉందని చెబుతున్నారు.ముఖ్యంగా గత ఏడాది అమెరికా దాడులలో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాల
అమెరికా, ఇరాన్‌ల మధ్య అత్యంత కీలకమైన దౌత్య ఒప్పందం త్వరలో జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 19న ఈ చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. దీనివల్ల వ్యూహాత్మకంగా ప్రపంచ రవాణా రంగానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన హోర్ముజ్ జలసంధి రవాణా మార్గం వెంటనే తెరుచుకుంటుందని, దశాబ్దాల శత్రుత్వానికి ముగింపు పలుకుతూ నూతన దౌత్య సంబంధాలు ఊపందుకుంటాయని ట్రంప్ వివరించారు.ఈ పరిణామాల మధ్య ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమంపై కీలకమైన ప్రకటన చేశారు. భవిష్యత్తులో అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయబోమని ఆ దేశం అంగీకరించిందని వెల్లడించారు. రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు సుమారు 300 మిలియన్ డాలర్ల నిధులు అమెరికాకు అందుతాయనే వార్తలను కూడా తోసిపుచ్చారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు.14 షరతులతో కూడిన ఈ ఒప్పందంపై ట్రంప్ స్పందించారు. తాము ఎప్పటికీ అణ్వాయుధాన్ని సమకూర్చుకోబోమని ఇరాన్ అంగీకరించిందని పేర్కొన్నారు. అలాగే అమెరికా ఇరాన్‌కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందంటూ వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని, ఇది డెమొక్రాట్లు సృష్టించిన ఫేక్ న్యూస్ గా కొట్టిపారేశారు. ఇరాన్ తో కుదిరిన శాంతి ఒప్పందాల ప్రకారమే ముందుకు వెళ్తామనే విషయాన్ని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారీ పోస్ట్ ద్వారా.ఇరాన్ తన వాగ్దానాలను నిలబెట్టుకుంటే ఆ దేశానికి జప్తు చేసిన నిధులను విడుదల చేయడం సహా పునర్నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు అందే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నిధులను అమెరికా సమకూర్చుతుందనే వాదనలు సైతం లేకపోలేదు. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను అటు ఇరాన్ గానీ, ఇటు అమెరికా గానీ ఇంకా బహిర్గతం చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫలితంగా కొన్ని షరతులపై పీటముడి పడే అవకాశం ఉందని చెబుతున్నారు.ముఖ్యంగా గత ఏడాది అమెరికా దాడులలో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాల భూగర్భంలో నిక్షిప్తం చేసి ఉంచిన యురేనియంను ఎవరు తరలిస్తారనే అంశంపై ట్రంప్ టీమ్ నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఒప్పంద అమలును పర్యవేక్షించే బాధ్యత ఎవరిదనే విషయంలోనూ స్పష్టత కొరవడింది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం ఈ అణు ఒప్పందంపై భిన్నమైన వాదనను వినిపిస్తోంది. ఒప్పందంపై సంతకాలు చేసినప్పటి నుంచి 60 రోజుల వ్యవధిలో మాత్రమే అణు కార్యక్రమానికి సంబంధించిన తుది నిర్ణయం వెలువడుతుందని చెబుతోంది.