
ఆర్థిక ఉత్పత్తుల మిస్సెల్లింగ్పై నిషేధం. బ్యాంక్ ఇన్సెంటివ్ విధానాలపై ఆర్బీఐ కఠినత్వం. తప్పుడు ప్రకటనలకు బ్యాంకులదే పూర్తి బాధ్యత. RBI New Rules: ఆర్థిక ఉత్పత్తులు, సేవల అమ్మకాలలో సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించే మోసపూరిత పద్ధతులకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం కఠినమైన నిబంధనలను జారీ చేసింది.
బ్యాంకులు తమ ఉద్యోగులపై విక్రయాల కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చేలా లేదా ఎక్కువ అమ్మకాలను ప్రోత్సహించే ఇన్సెంటివ్ విధానాలపై నిషేధం విధించింది. 'అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ అండ్ సేల్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్' పేరుతో తీసుకొచ్చిన ఈ సవరించిన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
School Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 26న స్కూళ్లకు సెలవు కొత్త మార్గదర్శకాల ప్రకారం, బీమా కంపెనీలు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి థర్డ్ పార్టీ సంస్థలు బ్యాంక్ ఉద్యోగులకు నేరుగా నగదు రూపంలో గానీ, బహుమతుల రూపంలో గానీ ప్రోత్సాహకాలు అందించడాన్ని ఆర్బీఐ (RBI New Rules)పూర్తిగా నిషేధించింది.
బ్యాంకులు తమ సిబ్బందికి ఇచ్చే సొంత ఇన్సెంటివ్లపై నిషేధం లేనప్పటికీ, అవి కస్టమర్లను బలవంత పెట్టేలా లేదా దూకుడుగా విక్రయాలు జరిపేలా ఉండకూడదని స్పష్టం చేసింది. ఖాతాదారుల ప్రయోజనాలే పరమావధిగా బ్యాంకుల అంతర్గత పాలసీలు ఉండాలని ఆదేశించింది.
ఇకపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అఫిలియేట్లు, లోన్ సర్వీస్ ప్రొవైడర్లను కూడా డైరెక్ట్ సెల్లింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ ఏజెంట్ల పరిధిలోకి తీసుకువస్తూ ఆర్బీఐ నిబంధనలను సవరించింది. వీరు చేసే తప్పుడు ప్రకటనలు, మార్కెటింగ్ మోసాలకు ఆయా ఉత్పత్తులను అందించే బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలదే పూర్తి బాధ్యత అని తేల్చిచెప్పింది.
ఈ నిర్ణయం ద్వారా డిజిటల్ మాధ్యమాలలో జరిగే ఆర్థిక మోసాలకు గట్టి బ్రేక్ పడనుంది
.