
ఇరాన్లో 107 రోజుల యుద్ధంలో అమెరికా 112 బిలియన్ డాలర్లు(సుమారు రూ.10.60 లక్షల కోట్లు) నష్ట పోయిందని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ఇరాన్ కాస్ట్ ట్రాకర్ అంచనా వేసింది.... వాషింగ్టన్, జూన్ 15: ఇరాన్లో 107 రోజుల యుద్ధంలో అమెరికా 112 బిలియన్ డాలర్లు(సుమారు రూ.10.60 లక్షల కోట్లు) నష్ట పోయిందని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ఇరాన్ కాస్ట్ ట్రాకర్ అంచనా వేసింది.
ఇదే సమయంలో అమెరికాలోని వినియోగదారులపై ఇంధన, తదితర భారం 58.6 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా కాంగ్రె్‌సకు పెంటగాన్ చెప్పిన లెక్కలను ఆ ట్రాకర్ ఉటంకిస్తూ.. యుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే 11.3 బిలియన్ డాలర్లను ఖర్చు చేశారని చెప్పింది.
అప్పటి నుంచి రోజుకు 1 బిలియన్ డాలర్లు చొప్పున ఖర్చయిందని పేర్కొంది. ఈ యుద్ధ కాలంలో ప్రతి అమెరికా కుటుంబంపై పెట్రోల్, డీజిల్ ఖర్చు అదనంగా 447.52 డాలర్లు మేరకు పెరిగింది. యుద్ధం ప్రారంభమైన తొలి ఆరురోజుల్లో 11.3 బిలియన్ డాలర్లు ఖర్చు అయినట్లు చట్టసభ్యులకు క్యాపిటల్ హిల్‌లో జరిగిన సమావేశంలో పెంటగాన్ అధికారులు వివరించారు.
అయితే దాడులకు ముందు సైనిక పరికరాలు, సిబ్బందిని సమకూర్చుకోవడంలో జరిగిన పలు ఖర్చులను దీనిలో చేర్చకపోవడం వల్ల ఆ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. తొలి రెండు రోజుల యుద్ధానికి సమకూర్చిన మందుగుండు సామగ్రికి 5.6 బిలియన్ ఖర్చయినట్లు కాంగ్రె్‌సకు గతంలో రక్షణ అధికారులు వివరించారు.
పెంటగాన్ తాజా బహిరంగ అంచనా ప్రకారం యుద్ధం ప్రత్యక్ష ఖర్చు 4 బిలియన్ డాలర్ల మేరకు పెరిగింది. వార్ బిల్లును పెంటగాన్ తొలుత 25 బిలియన్ డాలర్లుగా అంచనా వేసినా, తర్వాత దానిని 29 బిలియన్ డాలర్లకు పెంచింది. పైలట్ డ్రెస్‌లో చిన్నారి..
ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.! టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!