
తిరుపతి (లీగల్): సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై తిరుపతి నాలుగో అదనపు మున్సిఫ్ కోర్టులో సోమవారం ప్రైవేటు కేసు దాఖలైంది. భాజపా సీనియర్ నేత, తితిదే పాలకమండలి సభ్యుడు జి.భానుప్రకాష్‌రెడ్డి తన న్యాయవాది కొత్తపల్లి అజయ్‌కుమార్‌తో కలిసి ఈ కేసు దాఖలు చేశారు.
గతంలో ఇదే ఘటనపై న్యాయవాది ద్వారా ప్రకాష్‌రాజ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, లక్ష్మణుడిని ఉద్దేశించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అవి వారి మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు.
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 196, సెక్షన్ 299 కింద కేసును విచారించాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ 10 రోజులైనా ఇంకా లభించలేదు
.