
Vanda Devullu: వైవిధ్యభరితమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటి, నిర్మాత నిహారిక కొణిదెల ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు తన బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. “విజయ్ ఆంటోని కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘బిచ్చగాడు’ సినిమా సాధించిన విజయం కంటే, ఈ ‘వంద దేవుళ్ళు’ చిత్రం ఇంకా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు.
read also: Sanchita Ugale Last Video: ఇన్‌స్టాగ్రామ్‌లో సంచిత ఉగాలే చివరి వీడియో.. అంతలోనే ఏం జరిగింది? సినిమాపై నిహారిక ప్రశంసలు కురిపిస్తూ.. “నేను ఈ చిత్రాన్ని ఇప్పటికే చూశాను. ప్రతి అమ్మలోనూ ఒక సాధారణ అమ్మాయి ఉంటుందనే సరికొత్త కోణాన్ని దర్శకుడు శశి గారు తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.
విజయ్ ఆంటోని గారు కేవలం గొప్ప నటుడే కాదు, అంతకంటే మంచి వ్యక్తి. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు ఆయనపై గౌరవం మరింత పెరిగింది. మాతృమూర్తిని ప్రేమించే ప్రతి ఒక్కరూ థియేటర్లలో తప్పక చూడాల్సిన చిత్రమిది” అని పేర్కొన్నారు. అనంతరం హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ..
“దర్శకుడు శశి ఈ కథను నాకు వివరించినప్పుడు నా కళ్ళు చెమర్చాయి, కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఈ సినిమా ద్వారా శశి నాకు నటుడిగా మరొక కొత్త జీవితాన్ని ప్రసాదించారు” అని ఎమోషనల్ అయ్యారు. చిత్ర దర్శకుడు శశి సినిమా కథాంశం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“‘బిచ్చగాడు’ చిత్రానికి ఈ కథ పూర్తిగా భిన్నమైనది. మన కంటికి కనిపించే అమ్మను ఒక దేవతలా చూపిస్తే అది ‘బిచ్చగాడు’ అవుతుంది.. అదే అమ్మను ఒక సాదాసీదా మనిషిలా, తనకూ కొన్ని ఇష్టాలు ఉంటాయనే కోణంలో
చూపిస్తే అది ‘వంద దేవుళ్ళు’ అవుతుంది” అని సినిమా మూలకథను వివరించారు.
ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పణలో, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామంజనేయులు జవ్వాజీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Chandrababu Naidu: సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Sanchita Ugale Last Video: ఇన్‌స్టాగ్రామ్‌లో సంచిత ఉగాలే చివరి వీడియో.. అంతలోనే ఏం జరిగింది?
Vijay Deverakonda Rashmika: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇంట్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డిన్నర్!
CM Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసు విచారణ వాయిదా!
Sanchita Ugale Suicide: కుంకుమ భాగ్య ఫేమ్ టీవీ నటి సంచిత ఉగాలే ఆత్మహత్య!
Raghava Lawrence Political Entry: సీఎం విజయ్ తో లారెన్స్ దోస్తీ.. ‘టీవీకే’ పార్టీ తరఫున తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికల బరిలోకి?
CM Vijay Divorce Case: విజయ్ విడాకుల కేసులో నేడు కీలక విచారణ