
TAGSA: శాన్ ఆంటోనియోలోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాన్ ఆంటోనియో (TAGSA) సంస్థ, జులై 19, 2026న తెలంగాణ ఆవిర్భావ , సాంస్కృతిక వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం శాన్ ఆంటోనియోలోని 901 N లూప్ 1604 W చిరునామాలో ఉన్న ష్రైన్ ఆడిటోరియంలో జరగనుంది.
ప్రధాన ఆకర్షణ.. ఈ వేడుకల్లో భాగంగా బోనాలు, లైవ్ ఎంటర్టైన్మెంట్, సాంస్కృతిక కార్యక్రమాలు , లైవ్ డిజె (DJ) వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉండనున్నాయి. అలాగే ఆహ్వానితుల కోసం భోజన సౌకర్యంతో పాటు క్యాష్ బార్ సదుపాయాన్ని కూడా కల్పించారు.
ప్రవేశం వివరాలు.. టిక్కెట్ల విషయానికి వస్తే, నాన్-మెంబర్లకు $25 , సభ్యులకు $20గా ధర నిర్ణయించారు, అయితే 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. లైఫ్‌టైమ్ మెంబర్షిప్ ($200) తీసుకున్న వారికి, అలాగే స్పాన్సర్లు, దాతలు , కొత్త సభ్యులకు ఈ కార్యక్రమంలో ప్రవేశం ఉచితంగా ఉంటుంది.
ఈ సంస్థ 2026-2027 సంవత్సరానికి గాను డాక్టర్ స్వప్న కొండ అధ్యక్షురాలిగా, స్నిగ్ధ బొప్పిడి ప్రెసిడెంట్-ఎలెక్ట్‌గా, రాజశేఖర్ రియాడ జనరల్ సెక్రటరీగా, నరేందర్ పుట్ట ట్రెజరర్‌గా , మదన్ కుమార్ పెద్దిగారి జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు
.