
భారతీయులు విస్తృతంగా ఉపయోగించే చాలా వస్తువులు మన దేశంలో తయారుకావు.. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. అయితే కొన్ని మన పొరుగు దేశమైన పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతాయి. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున నిలిచింది.
అయినప్పటికీ పాక్ మన దేశంతో చేసే వ్యాపారం ద్వారా చాలా డబ్బు సంపాదిస్తోంది. భారత్‌లో పండగలప్పుడు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వాడే సైంధవ లవణం (కల్లుప్పు) ఎక్కువగా పాకిస్తాన్ నుంచే వస్తుంది. భారత్‌కు ముల్తానీ మట్టి పాకిస్తాన్ నుంచే వస్తుంది.
మన దేశం పాక్ నుంచి పెద్ద మొత్తంలో ముల్తానీ మట్టిని కొనుగోలు చేస్తుంది. భారత్‌లో విస్తృతంగా అమ్ముడయ్యే బినానీ సిమెంట్ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిందే. పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున డ్రై ఫ్రూట్స్, నట్స్‌ను కొనుగోలు చేస్తుంది భారత్.
మన దేశంలో డ్రైప్రూట్స్ ఎక్కువగా వాడుతుంటాం…అందుకే దిగుమతి తప్పడంలేదు. మనం వాడే కళ్లద్దాలలో ఉపయోగించే ఆప్టికల్స్‌ను కూడా భారత్ పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేస్తుంది. భర్త చనిపోయినా ఈ భారతీయ మహిళలు విధవలు కారు.. ఎందుకో తెలుసా?
Women Army : ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సైన్యం ఏ దేశంలో ఉందో తెలుసా? బ్యాచిలర్స్ Vs పెళ్లైన మగాళ్లు.. వీరిలో ఎక్కువకాలం బ్రతికేది ఎవరు? షుగర్ ఉత్పత్తి, వాడకంలో వరల్డ్ నెంబర్ 1 ఎవరో తెలుసా..?