
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Zee Network Market Share: టెలివిజన్ రంగంలో జీ ఎంటర్ టైన్మెంట్స్ విశేష ప్రేక్షకాధరణ పొందింది. ఇంటిల్లపాది అన్నివర్గాల వారిని అలరించే వినోద కార్యక్రమాలతో అన్నిభాషల్లోనూ వీక్షకుల పెరుగుదల నెట్వర్క్ పురోగతిని సూచించింది.
18.6శాతం మార్కెట్ షేర్ సాధించి 48 వారాల గరిష్టస్థాయిని సాధించింది. బ్లాక్ బస్టర్ సినిమాలు, ఆకట్టుకునే సీరియళ్లతో కంటెంట్ వినియోగంలో అగ్రగామిగా నిలిచిన మీడియా దిగ్గజం జీ ఎంటర్ టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఉనికిని చాటుకుంది.
ప్రధాన హిందీ ఛానెళ్లైన జీ టీవీ, జీ సినిమా వీక్షకుల సంఖ్య గత మూడు నెలల గణాంకాలతో పోలిస్తే 120 బేసిస్ పాయింట్లతో బలమైన వృద్ధిని సాధించింది. ఓమ్ని-ఛానల్ కంటెంట్ వ్యూహం అన్ని భాషా మార్కెట్లలో భారీ లాభాలను ఆర్జిస్తోంది. ఫిక్షన్ కార్యక్రమాలలో భావోద్వేగభరితమైన కథనాలతో పాటు, అధిక ప్రభావం చూపే నాన్-ఫిక్షన్ అంశాలతో కూడిన సరికొత్త కంటెంట్ వీక్షకుల ఆదరణ బలోపేతమైంది.
ప్రతిఇంటా కుటుంబ సమేతంగా వినోదకార్యక్రమాలను చూసి సంతృప్తి చెందే కార్యక్రమాలకు తోడు బ్లాక్ బస్టర్ సినిమాలు, సినిమా ప్రీమియర్లు తోడయ్యాయి. Zee మీడియా ప్రముఖ హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ Zee TV, వరుసగా 17 వారాల పాటు హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ప్రైమ్‌టైమ్ లీడర్‌గా నిలిచి, బలమైన వృద్ధిని సొంతం చేసుకుంది.
గంగా మై కీ బేటియాన్, వసుధ, తుమ్ సే తుమ్ తక్ వంటి ఫిక్షన్ షోలు మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో ఛానెల్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. బలమైన పాత్రలు, అధిక భావోద్వేగ అంశాలతో రాబోయే 'తూ
హీ రే దిల్ మేయిన్, దిలోన్ కీ రామ్ లీలా వంటి కార్యక్రమాలతో జీ టీవీ తన పట్టును బలోపేతం చేసుకోవాలని సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమాల ప్రసారంతో హిందీ GEC మార్కెట్లో మరింత పెద్ద వాటాను సాధించాలనే లక్ష్యంగా ఎంచుకుంది. ఇక సినిమా విభాగంలో 22వ వారంలో వీక్షకుల సంఖ్యలో 27శాతం వృద్ధితో Zee Cinema అగ్రగామి ఛానెల్‌గా నిలిచింది. అఖండ 2–తాండవం, కిష్కింధాపురి, దిల్ మధరాసి వంటి ప్రజాదరణ పొందిన చిత్రాల వరల్డ్ టీవీ ప్రీమియర్లు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. యాక్షన్, హారర్, థ్రిల్ అంశాలతో కూడిన ఈ సినిమాలు ప్రేక్షకులలో భారీ ఆదరణను పొందాయి. వివిధ భాషల మార్కెట్లలో కూడా మంచి వృద్ధి ధోరణి కనిపించింది. కీలక ప్రాంతాలలో మొదటి రెండు స్థానాల్లో నిలవడం ద్వారా ఈ మార్కెట్లు తమ బలమైన ఉనికిని చాటుకున్నాయి. జీ మరాఠీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మరాఠీ ఛానల్ జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌గా నిలిచింది. మూడు నెలల్లో వీక్షకుల ఆదరణ 33.9 శాతం నుంచి తాజాగా వారంలో 38.8 శాతానికి పెరిగింది. ముఖ్యంగా, నాన్-ప్రైమ్‌టైమ్ ఒరిజినల్ ప్రోగ్రామింగ్లోకి వ్యూహాత్మకంగా విస్తరించడం వల్ల ఈ ఛానెల్ 3 సంవత్సరాలలో మే 2023 నుంచి మే 2026 నాటికి వీక్షకుల్లో 82 శాతం పెరుగుదలతో రికార్డు క్రియేట్ చేసింది. ఆకట్టుకునే ఫిక్షన్ కార్యక్రమాల వల్ల టాప్ 10 ర్యాంకింగ్స్‌లో 5 షోలతో స్లాట్ లీడర్షిప్ను సాధించింది. మరాఠీ సినిమాల విభాగం కూడా 57.8శాతం వాటాతో తన ఆధిక్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. కోల్‌కతాలో అన్ని నానర్లలో జీ బంగ్లా నెం.1 ఛానెల్‌గా అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. స రే గ మ ప, దీదీ నెం.1 వంటి ప్రభావం చూపే కంటెంట్ ఐపీల ద్వారా ఈ ఛానెల్ నాన్-ఫిక్షన్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఫిక్షన్, నాన్-ఫిక్షన్ రెండింటిలోనూ కనబరిచిన బలమైన పనితీరు, ఆ భాషలోని 14 ప్రైమ్ టైమ్ స్లాట్లలో 10 స్లాట్లను ఈ ఛానెల్ దక్కించుకోవడానికి మరింతగా దోహదపడింది. మార్కెట్లోని కంపెనీకి చెందిన సినిమా ఛానెల్ జీ బంగ్లా సోనార్ కూడా 39.4 వాటాతో సినిమాల విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఒడియా జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మార్కెట్ నుంచి కంపెనీ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. Zee సార్థక్ వరుసగా ఆరవ సంవత్సరం ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. కంపెనీ లీనియర్ పోర్ట్‌ఫోలియోలో దక్షిణ ప్రాంతం బలమైన వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలిచింది. ఆకర్షణీయమైన కంటెంట్‌తో మొత్తం మార్కెట్ వాటాకు గణనీయంగా దోహదపడుతోంది. Zee కన్నడ అద్భుతమైన పనితీరును కనబరిచింది. వరుసగా ఎనిమిదవ సంవత్సరం కూడా GEC విభాగంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. దీని ఫిక్షన్ షోలు టాప్ 10లో 5 స్థానాలను ఆక్రమించగా, స రే గ మ ప లిటిల్ ఛాంప్స్, జోడి నం.1 వంటి నాన్-ఫిక్షన్ కార్యక్రమాలు ప్రేక్షకులలో విశేష ఆదరణ పొందాయి. Zee తెలుగు గత 5 వారాలలో రెండుసార్లు నంబర్ 1 జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్‌గా నిలిచింది. 2020 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. హైదరాబాద్‌లో అన్ని విభాగాలలోనూ ఈ ఛానల్ అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు సినిమాల విభాగంలో Zee సినిమాలు 25.2శాతం వాటాతో నంబర్ 2 స్థానాన్ని నిలబెట్టుకుంది. అదేవిధంగా జీ తమిళం మార్కెట్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఛానల్‌గా నిలిచింది. నాలుగో త్రైమాసికం నాటికి జీ ఛానల్ వాటా 21.1 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 24.9శాతం వాటాతో జీ తమిళ ఛానల్ రెండో స్థానంలో నిలిచింది. Zee కేరళం మే 2026లో 11.5శాతం మార్కెట్ వాటాతో మలయాళ జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. వీక్షకుల అభిరుచికి తగ్గట్టుగా వినోద కార్యక్రమాలే ఆదరణకు ప్రధాన కారణమని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ రాఘవేంద్ర హన్సూర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రామాణికమైన, భావోద్వేగాలను రేకెత్తించే, అత్యుత్తమ సినిమాటిక్ నైపుణ్యంతో రూపొందించి ప్రీమియం, సాంస్కృతికంగా పాతుకుపోయిన కథలలోనే వినోద రంగ భవిష్యత్తు ఉందని విశ్వసిస్తున్నామన్నారు. అత్యంత పోటీ నెలకొన్న నేపథ్యంలో వ్యూవర్షిప్ టైమ్ లోనూ జీ ప్రసారాలనే ఎంచుకున్నారని ప్రస్తావించారు. ప్రామాణికమైన కథనం, సంఘటనలు, పోటీకి అతీతమైందని ధృవీకరించిందన్నారు. భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు, వినియోగదారులను లోతుగా అర్థం చేసుకోవడం, ప్రాముఖ్యత ఉన్న కథలను చెప్పడం, శక్తివంతమైన కంటెంట్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై తమ దృష్టి మారదన్నారు. ఈ మైలురాయి ప్రోత్సాహకరమైందన్నారు. ఇటీవల 'యునైట్8 స్పోర్ట్స్' బ్రాండ్ పేరుతో నాలుగు స్పోర్ట్స్ ఛానెళ్లను ప్రారంభించడం, వివిధ భాషలలో కొత్త ఫిక్షన్, నాన్-ఫిక్షన్ కార్యక్రమాలను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆకట్టుకునే కంటెంట్ అందించడం ద్వారా బలమైన వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి కంపెనీకి మంచి స్థానాన్ని కల్పిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా జీ ప్రసారాలు 190కి పైగా దేశాలలో 140 కోట్లకు పైగా ప్రజలకు చేరువయ్యాయి. లీనియర్ టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సినిమాలు, సంగీతం, ప్రత్యక్ష వినోదం ద్వారా వివిధ భాషలలో విభిన్న కథలకు జీవం పోస్తోంది. ప్రపంచవ్యాప్త ఉనికిని కలిగిన ఒక నిజమైన భారతీయ బ్రాండ్‌గా, ఆశావాదం , ఐక్యత శక్తిని చాటిచెప్పే అసాధారణ క్షణాలను సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాలను సుసంపన్నం చేయడానికి Zee బాధ్యతాయుత పాత్రను పోషిస్తోందని చెప్పేందుకు నానాటికీ పెరుగుతున్న వీక్షకుల ఆదరణే సాక్ష్యంగా నిలుస్తోంది.