
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడడంతో దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర దిగివచ్చింది. ఏకంగా 4.55 శాతం తగ్గి 83.36 డాలర్లకు చేరుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడడంతో దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి.
ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర దిగివచ్చింది. ఏకంగా 4.55 శాతం తగ్గి 83.36 డాలర్లకు చేరుకుంది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (94.74) బలపడింది. ఉదయం భారీ లాభాల్లో కదలాడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత కాస్త కిందకు దిగి వచ్చాయి.
మొత్తానికి లాభాలతోనే రోజును ముగించాయి (Indian stock market). గత సెషన్ ముగింపు (75,527)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం వెయ్యి పాయింట్లకు పైగా లాభంతో మొదలన సెన్సెక్స్ ఆ తర్వాతా అదే జోష్‌ను కొనసాగించాయి. అయితే మధ్యాహ్నం తర్వాత గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు.
దీంతో సెన్సెక్స్ చివరకు 736 పాయింట్ల లాభంతో 76,264 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 231 పాయింట్ల లాభంతో 23,853 వద్ద స్థిరపడింది (stock market news today). సెన్సెక్స్, నిఫ్టీలో కల్యాణ్ జువెల్లర్స్, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ, యూనో మిండా, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ప్రెస్టిజ్ ఎస్టేట్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news).
అరబిందో ఫార్మా, వెర్నోవా టీడీ, ఎన్ఎమ్డీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్, వేదాంతా మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 384 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 781 పాయింట్లు ఆర్జించింది. ఐదు కంపెనీలుగా వేదాంతా..
కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం.. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ
..