
UPSC CSE Prelims Result 2026: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (CSE Prelims 2026) ఫలితాల విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు ఈ వారంలోనే (జూన్ మూడో వారంలో) కమిషన్ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో అందుబాటులోకి రానున్నాయి.
గత నెల మే 24, 2026 న దేశవ్యాప్తంగా ఈ ప్రిలిమ్స్ పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగాయి. మొత్తం 933 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు ఏకంగా 8,19,372 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. సుమారు 5.49 lakh (54.9%) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Read Also :MSBTE Results 2026: విడుదల కానున్న MSBTE ఫలితాలు..స్కోర్ కార్డ్ డౌన్లోడ్ లింక్ ఇదే! ఈ ఏడాది ప్రిలిమ్స్ పరీక్ష దేశవ్యాప్తంగా 83 నగరాల్లోని 2,072 కేంద్రాల్లో ఓఎంఆర్ (OMR) ఆధారిత ఆఫ్‌లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో జరిగింది.
ఉదయం జనరల్ స్టడీస్ (GS Paper-I), మధ్యాహ్నం సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CSAT Paper-II) నిర్వహించారు. చారిత్రాత్మక మార్పు: యూపీఎస్సీ ఈసారి పాత సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ సరికొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టింది. పరీక్ష జరిగిన కేవలం నాలుగు రోజులకే, అంటే మే 28, 2026న ప్రొవిజనల్ కీ (Provisional Answer Key) ని విడుదల చేసింది.
గతంలో ఫైనల్ ఫలితాలు వచ్చిన తర్వాత (దాదాపు ఏడాదికి) మాత్రమే కీ ఇచ్చే అలవాటు ఉండేది. ఈ ప్రాథమిక కీ లో మొత్తం 100 ప్రశ్నలకు గాను ఒక ప్రశ్నను కమిషన్ తొలగించింది (Dropped). యూపీఎస్సీ సాధారణంగా పరీక్ష ముగిసిన 15 నుండి 20 రోజుల్లోపు ఫలితాలను ప్రకటిస్తుంది.
పరీక్ష జరిగి నేటికి (జూన్ 15) 22 రోజులు కావస్తుండటంతో, ఫలితాలు ఏ క్షణంలోనైనా అప్లోడ్
అయ్యే అవకాశం ఉంది.
మొదటగా యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లేదా upsconline.nic.in ఓపెన్ చేయండి.
హోమ్‌పేజీలో ‘What’s New’ లేదా ‘Written Results’ సెక్షన్లోకి వెళ్లి ‘Civil Services (Preliminary) Examination, 2026 Result’ లింక్‌పై క్లిక్ చేయండి.
లింక్ క్లిక్ చేయగానే అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన పీడీఎఫ్ (PDF) స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసిన పీడీఎఫ్ ఫైల్లో Ctrl+F (మొబైల్లో అయితే సెర్చ్ ఐకాన్) ఉపయోగించి మీ రోల్ నంబర్ టైప్ చేసి వెతకండి. మీ నంబర్ హైలైట్ అయితే మీరు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లే.
ముఖ్య గమనిక: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అనేది కేవలం స్క్రీనింగ్ లేదా అర్హత పరీక్ష (Qualifying Exam) మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది మెరిట్ ర్యాంకింగ్ (Final UPSC Rankings) లో పరిగణనలోకి తీసుకోరు. ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు DAF-I (Detailed Application Form) నింపాల్సి ఉంటుంది. యూపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 21, 2026 నుండి ప్రారంభం కానున్నాయి.
PM Modi on US-Iran Peace Agreement:అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Telangana news: చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన మంత్రి సీతక్క
MSBTE Results 2026: విడుదల కానున్న MSBTE ఫలితాలు..స్కోర్ కార్డ్ డౌన్లోడ్ లింక్ ఇదే!
NEET Re-Exam 2026: 21న NEET రీ ఎగ్జామ్.. డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే!
RGUKT IIIT Results: ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల.. ప్రొవిజనల్ లిస్ట్‌ను ప్రకటించిన మంత్రి లోకేశ్
Telangana government: 9 వేల పాఠశాలలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం
NEET UG Re Exam 2026 : నీట్ రీ-ఎగ్జామ్‌లో రఫ్ వర్క్ పేజీలు రెట్టింపు తో పాటు పరీక్ష సమయాన్ని పెంపు