
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కొత్త చిత్రం మా ఇంటి బంగారం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాజ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సమంత పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది.
ఈమధ్య ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన సినీ జీవితంలోని మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తన తొలి తెలుగు చిత్రం ఏ మాయ చేసావే గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సమంత మాట్లాడుతూ, “ఆ సమయంలో నాకు హైదరాబాద్ గురించి పెద్దగా తెలియదు.
నేను ఎక్కువగా చెన్నైలోనే ఉండేదాన్ని. ఏ మాయ చేసావే సినిమా విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను. ఆరోజు రాత్రి నా కజిన్ ఇంట్లో సినిమా గురించి ఆలోచిస్తా నిద్రపోయాను.. మరుసటి రోజు సినిమా చూసే అవకాశం దొరికింది” అని తెలిపింది. సినిమా విడుదలైన తర్వాత తన స్నేహితుల్లో ఒకరు ఓ రివ్యూ చదవమని పంపారని సమంత గుర్తు చేసుకుంది.
ఆ రివ్యూలో తన గురించి చాలా మంచి మాటలు రాశారని చెప్పింది. ముఖ్యంగా “సమంత నెక్స్ట్ సూపర్ స్టార్ అవుతుంది” అని అందులో పేర్కొనడం తనను ఎంతో ఆశ్చర్యపరిచిందని తెలిపింది. ఆ మాటలు చదివిన తర్వాత తనలో కొత్త ఆత్మవిశ్వాసం వచ్చిందని సమంత చెప్పింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో తాను మంచి భవిష్యత్తు సాధించగలననే నమ్మకం అప్పుడే కలిగిందని పేర్కొంది. ఆ రివ్యూ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైందని, ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేదని వెల్లడించింది. ఏ మాయ చేసావే చిత్రం సమంత కెరీర్‌కు పెద్ద మలుపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఆ సినిమా ద్వారా ఆమెకు భారీ గుర్తింపు లభించింది. అనంతరం వరుస విజయాలతో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగింది. ఇప్పుడు
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కొత్త చిత్రం మా ఇంటి బంగారం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాజ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సమంత పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది.
ఈమధ్య ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన సినీ జీవితంలోని మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తన తొలి తెలుగు చిత్రం ఏ మాయ చేసావే గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
సమంత మాట్లాడుతూ, “ఆ సమయంలో నాకు హైదరాబాద్ గురించి పెద్దగా తెలియదు. నేను ఎక్కువగా చెన్నైలోనే ఉండేదాన్ని. ఏ మాయ చేసావే సినిమా విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను. ఆరోజు రాత్రి నా కజిన్ ఇంట్లో సినిమా గురించి ఆలోచిస్తా నిద్రపోయాను.. మరుసటి రోజు సినిమా చూసే అవకాశం దొరికింది” అని తెలిపింది.
సినిమా విడుదలైన తర్వాత తన స్నేహితుల్లో ఒకరు ఓ రివ్యూ చదవమని పంపారని సమంత గుర్తు చేసుకుంది. ఆ రివ్యూలో తన గురించి చాలా మంచి మాటలు రాశారని చెప్పింది. ముఖ్యంగా “సమంత నెక్స్ట్ సూపర్ స్టార్ అవుతుంది” అని అందులో పేర్కొనడం తనను ఎంతో ఆశ్చర్యపరిచిందని తెలిపింది.
A post shared by idlebrain.com - Telugu films, reviews, videos (@idlebrain.official)
ఆ మాటలు చదివిన తర్వాత తనలో కొత్త ఆత్మవిశ్వాసం వచ్చిందని సమంత చెప్పింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తాను మంచి భవిష్యత్తు సాధించగలననే నమ్మకం అప్పుడే కలిగిందని పేర్కొంది. ఆ రివ్యూ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైందని, ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేదని వెల్లడించింది.
ఏ మాయ చేసావే చిత్రం సమంత కెరీర్‌కు పెద్ద మలుపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ద్వారా ఆమెకు భారీ గుర్తింపు లభించింది. అనంతరం వరుస విజయాలతో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగింది.
ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సమంత, తన తొలి సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.