
Bommadevara Dheeraj Archery: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు సాధించి, దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఆంధ్రప్రదేశ్ అగ్రశ్రేణి ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ధీరజ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ధీరజ్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. Read also: FIH Womens Nations Cup: FIH ఉమెన్స్ హాకీలో అమెరికాపై ఘన విజయం సాధించిన భారత్ విజయవాడకు చెందిన 24 ఏళ్ల బొమ్మదేవర ధీరజ్ ఈ టోర్నీలో తిరుగులేని ఫామ్‌ను ప్రదర్శించాడు.
ముందుగా మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల కుంకుమ్ మొహోద్‌తో కలిసి రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కు బంగారు పతకం అందించాడు. ఆ తర్వాత ఏమాత్రం అలసట లేకుండా సాగిన రికర్వ్ వ్యక్తిగత (ఇండివిడ్యువల్) విభాగంలోనూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుని డబుల్ ధమాకా సృష్టించాడు.
ఈ అసాధారణ ప్రదర్శనతో ధీరజ్ ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ అయిన ప్రతిష్టాత్మక ‘వరల్డ్ కప్ ఫైనల్స్’కు కూడా అర్హత సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. Oliver Tree death: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Bhatti Vikramarka Birthday: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్ Srisailam News: సతీసమేతంగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్రమంత్రి Sangam crime: దువ్వూరులో రిటైర్డ్ టీచర్ ఫ్యామిలీ ఆత్మహత్య!
TDP MLA Chintamaneni Prabhakar : అర్ధరాత్రి నడిరోడ్డుపై ఎమ్మెల్యే వీరంగం PVN Madhav: వైసీపీ హయాంలో
నమోదైన దొంగ ఓట్లను తక్షణమే తొలగించాలి: పీవీఎన్ మాధవ్
Bapatla Train Robbery: బాపట్ల వద్ద రైలు దోపిడీ దొంగల బీభత్సం!