
Kavitha Boggubayi Yatra: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బొగ్గుబాయి యాత్రలో భాగంగా సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆమె మాట్లాడారు.
మంచిర్యాల నుంచే బొగ్గుబాయి యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతులు, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. Read also: Telangana Politics: 2028 ఎన్నికల్లో పాలమూరులో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయం: కేటీఆర్ ప్రస్తుతం సింగరేణిలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్ పేరుతో కార్మికుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అండర్‌గ్రౌండ్ మైనింగ్‌కు ప్రాధాన్యం ఇస్తే ఎక్కువ బొగ్గు ఉత్పత్తితో పాటు తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.సింగరేణి కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని, అధికారులు, కార్మికుల మధ్య వివక్ష చూపుతున్నారని విమర్శించారు. సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. తెలంగాణకు మరిన్ని బొగ్గు బ్లాకులు కేటాయించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు.
సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు, పెన్షన్ సవరణ, డిపెండెంట్ ఉద్యోగాల కల్పన, పెండింగ్ ప్రమోషన్ల మంజూరు వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ హామీని అమలు చేస్తామని తెలిపారు.
. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన వేతనాలు చెల్లించాలని, భూములు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించిన ఆమె, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, “గుండాగిరి రాజకీయాలు” మానుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలు ఎలాంటి బెదిరింపులకు భయపడరని అన్నారు. మంచిర్యాల జిల్లా ప్రజల ప్రేమాభిమానాలతో తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేసి, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ జెండా ఎగురవేస్తామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
Nipah Virus Alert:కేరళలో నిఫా వైరస్ కలకలం.. తమిళనాడు సరిహద్దుల్లో హై అలర్ట్!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Bhatti Vikramarka Birthday: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
Telangana Politics: 2028 ఎన్నికల్లో పాలమూరులో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయం: కేటీఆర్
Telangana Weather Update: తెలంగాణకు వచ్చే వారం రోజుల పాటు వర్ష సూచన..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Revanth Reddy: వర్షాల నేపథ్యంలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
Bhatti Vikramarka: సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ స్ఫూర్తికి ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి
Telangana Private School Fee : ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ ఫోకస్
సింగరేణిలో అవినీతి, కుంభకోణాల వల్ల సంస్థకు నష్టం జరుగుతోందని ఆరోపించిన కవిత, డీజిల్ కుంభకోణం, లిథియం అయాన్ బ్యాటరీ ప్రాజెక్టు ఒప్పందాలపై విచారణ జరిపించాలని కోరారు