
ఇంటర్నెట్‌డెస్క్: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది (Google CEO Sundar Pichai). ఆయన ప్రసంగించేందుకు వేదిక పైకి రాగానే పలువురు స్టాన్ఫోర్డ్ విద్యార్థులు వాకౌట్ చేశారు. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్‌కు ఉన్న ఒప్పందాన్ని నిరసిస్తూ పాలస్తీనాకు మద్దతుగా వారంతా వేదిక వద్ద నుంచి వెళ్లిపోయారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ నిరసనకు ప్రాజెక్ట్ నింబస్ కారణం. ఇజ్రాయెల్, గూగుల్, అమెజాన్ మధ్య కుదిరిన ఈ క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ కాంట్రాక్ట్ విలువ 1.2 బిలియన్ డాలర్లు.
గాజాలో ఘర్షణ విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ ప్రాజెక్ట్‌తో ప్రయోజనం లభిస్తోందని స్టాన్ఫోర్డ్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వారం ముందే వాకౌట్ గురించి ప్రకటన చేశారు. అయితే స్నాతకోత్సవ ప్రసంగంలో ఇతర స్పీకర్స్లానే పిచాయ్ (Sundar Pichai) ఏఐ గురించి ప్రస్తావించకపోయినా..
వ్యతిరేకతను మాత్రం ఎదుర్కొన్నారు. పలువురు విద్యార్థులు వేదిక వద్ద నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా.. తన ప్రసంగాన్ని కొనసాగించిన పిచాయ్ స్టాన్‌ఫోర్డ్‌లో తాను చదివిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ఆశావహ దృక్పథం అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
ప్రతీతరం తమదైన రీతిలో కష్టాలను ఎదుర్కొందన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘మనం డిగ్రీలు తీసుకొని ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత అదెలా ఉండాలో మనం ఎంచుకోలేం. కానీ, పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది’’ అని విద్యార్థులకు సూచనలు చేశారు.
అనంతరం విద్యార్థుల వాకౌట్ గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు పిచాయ్ ఆసక్తి చూపలేదు. ఈ నిరసన దృశ్యాలను ఎక్స్ వేదికగా షేర్ చేసిన భాజపా కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) తీవ్రంగా స్పందించారు.
అవకాశాన్ని కోల్పోయారని అసంతృప్తి వ్యక్తంచేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఇలాంటి ప్రవర్తన మూర్ఖత్వానికి నిదర్శమని వ్యాఖ్యానించారు. విజయవంతమైన టెక్ దిగ్గజం, స్టాన్ఫోర్డ్ పూర్వ విద్యార్థి అయిన పిచాయ్ అమూల్యమైన ప్రసంగాన్ని వినే