
మార్కెట్‌కి వెళ్ళినప్పుడు పచ్చగా, నిగనిగలాడుతూ, ఎంతో తాజాగా కనిపించే కూరగాయలను చూడగానే వెంటనే కొనేయాలనిపిస్తుంది. అయితే కొందరు వ్యాపారస్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది..
ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్‌కి వెళ్ళినప్పుడు పచ్చగా, నిగనిగలాడుతూ, ఎంతో తాజాగా కనిపించే కూరగాయలను చూడగానే వెంటనే కొనేయాలనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో కీరదోసకాయలు ఎక్కువగా కొంటుంటారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియో చూస్తే మాత్రం..
మీరు కూరగాయలు కొనే ముందు పది సార్లు ఆలోచించడం ఖాయం. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్లో వ్యాపారులు తమ పనిలో తాము బిజీగా ఉన్నారు. జనాలు కూడా ఎవరికి కావలసినవి వారు కొనుగోలు చేస్తున్నారు.
సరిగ్గా అదే సమయంలో ఒక కూరగాయల వ్యాపారి చేసిన నిర్వాకం కెమెరాకు చిక్కింది. ఆ వ్యాపారి తన వద్ద ఉన్న కీరదోసకాయలను ఒక బకెట్లో ఉన్న ముదురు పచ్చటి రసాయన ద్రవంలో ముంచుతున్నాడు. అలా ముంచి తీసిన వెంటనే, వాడిపోయినట్లున్న ఆ దోసకాయలు కాస్తా క్షణాల్లో ఎంతో పచ్చగా, నిగనిగలాడుతూ, అప్పుడే తోట నుంచి కోసుకొచ్చినట్లుగా మారిపోయాయి.
ఆ తర్వాత అతను వాటిని మిగతా కూరగాయలతో కలిపి అమ్మకానికి పెట్టాడు. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. మార్కెట్లో దొరికే కూరగాయలను ఇలా కెమికల్స్‌తో కలుషితం చేస్తే ఆరోగ్య పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘లాభాల కోసం జనాల ప్రాణాలతో చెలగాటమాడుతారా?
ఇప్పుడు కూరగాయల రూపంలో నేరుగా విషాన్నే తినిపిస్తున్నారా?’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందంపై నిరసన.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాకౌట్ సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు
..
Read Latest Telangana News And Telugu News