
బెంగాల్ లో టీఎంసీ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీలో తిరుగుబాటు మొదలైంది. ఎంపీలు.. ఎమ్మెల్యేలు మమతకు సవాల్ గా మారారు. బీజేపీతో టచ్ లోకి వెళ్లారు. ఏకంగా 20 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతుగా ncpi పార్టీలో చేరారు.
బీజేపీ చేతికి మట్టి అంటకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ చీలిక వెనుక ఏపీ బీజేపీ ఎంపీ ఉన్నట్లు ప్రచారం సాగుతున్న వేళ.. ఆ ఎంపీ స్పష్టత ఇచ్చారు.తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తిరుగుబాటు చేసి, బీజేపీలో చేరేలా ప్రోత్సహించడం వెనుక సీఎం రమేశ్ చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఎవరినైనా బీజేపీలో చేరేలా ఒప్పించేందుకు తనకు రెండు గంటలు చాలని రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు చాలా కాలం నుంచి తృణమూల్ ఎంపీలు తెలుసని, వారితో ఒక బంధం ఏర్పడిందని తెలిపారు. 2020లో దుబాయి, హైదరాబాద్లో జరిగిన తన కుమారుడి వివాహ వేడుకలకు సైతం వారు హాజరయ్యారని గుర్తు చేశారు.
తృణమూల్ ఎంపీలను ఆకర్షించేందుకు డబ్బు పంపిణీ జరగలేదని, పదవులు ఇస్తామంటూ ప్రలోభం పెట్టలేదని తెలిపారు. కాగా, గతంలో అస్సోంకు చెందిన కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ కలితా.. రాత్రికి రాత్రి బీజేపీలో చేరడంలో రమేశ్ పాత్ర ఉందని గుసగుసలు వినిపించాయి.మోదీ కేబినెట్ లోకి జనసేన, పవన్ ఛాయిస్ ఆయనే..!?బీజేపీలో చేరేలా ఎవరినైనా రెండు గంటల్లో ఒప్పిస్తాఅప్పట్లో మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థురాలిగా ఉండి, ఇప్పుడు తిరుగుబాటు చేసిన శతాబ్ది రాయ్ కూడా ఆ పెళ్లి వేడుకలకు హాజరు కావడం గమనార్హం.
తృణమూల్ ఎంపీలను ఆకర్షించేందుకు డబ్బు పంపిణీ జరగలేదని, పదవులు ఇస్తామంటూ ప్రలోభ పెట్టలేదని స్పష్టం చేశారు. అమిత్ షా ఆదేశాలతో ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఎన్నికలోనూ బీజేపీ సభ్యులను గెలిపించేందు కు సీఎం రమేశ్ తీవ్రంగా కృషి చేశారని రాజకీయ వర్గాలు
బెంగాల్ లో టీఎంసీ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీలో తిరుగుబాటు మొదలైంది. ఎంపీలు.. ఎమ్మెల్యేలు మమతకు సవాల్ గా మారారు. బీజేపీతో టచ్ లోకి వెళ్లారు. ఏకంగా 20 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతుగా ncpi పార్టీలో చేరారు. బీజేపీ చేతికి మట్టి అంటకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ చీలిక వెనుక ఏపీ బీజేపీ ఎంపీ ఉన్నట్లు ప్రచారం సాగుతున్న వేళ.. ఆ ఎంపీ స్పష్టత ఇచ్చారు.తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు తిరుగుబాటు చేసి, బీజేపీలో చేరేలా ప్రోత్సహించడం వెనుక సీఎం రమేశ్‌ చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎవరినైనా బీజేపీలో చేరేలా ఒప్పించేందుకు తనకు రెండు గంటలు చాలని రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు చాలా కాలం నుంచి తృణమూల్‌ ఎంపీలు తెలుసని, వారితో ఒక బంధం ఏర్పడిందని తెలిపారు. 2020లో దుబాయి, హైదరాబాద్‌లో జరిగిన తన కుమారుడి వివాహ వేడుకలకు సైతం వారు హాజరయ్యారని గుర్తు చేశారు. తృణమూల్‌ ఎంపీలను ఆకర్షించేందుకు డబ్బు పంపిణీ జరగలేదని, పదవులు ఇస్తామంటూ ప్రలోభం పెట్టలేదని తెలిపారు. కాగా, గతంలో అస్సోంకు చెందిన కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ భువనేశ్వర్‌ కలితా.. రాత్రికి రాత్రి బీజేపీలో చేరడంలో రమేశ్‌ పాత్ర ఉందని గుసగుసలు వినిపించాయి.మోదీ కేబినెట్ లోకి జనసేన, పవన్ ఛాయిస్ ఆయనే..!?బీజేపీలో చేరేలా ఎవరినైనా రెండు గంటల్లో ఒప్పిస్తాఅప్పట్లో మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థురాలిగా ఉండి, ఇప్పుడు తిరుగుబాటు చేసిన శతాబ్ది రాయ్ కూడా ఆ పెళ్లి వేడుకలకు హాజరు కావడం గమనార్హం. తృణమూల్ ఎంపీలను ఆకర్షించేందుకు డబ్బు పంపిణీ జరగలేదని, పదవులు ఇస్తామంటూ ప్రలోభ పెట్టలేదని స్పష్టం చేశారు. అమిత్‌ షా ఆదేశాలతో ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌ ఎన్నికలోనూ బీజేపీ సభ్యులను గెలిపించేందు కు సీఎం రమేశ్‌ తీవ్రంగా కృషి చేశారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.టీడీపీ లో సుదీర్ఘ కాలం పని చేసిన సీఎం రమేశ్.. రాజ్యసభలో పార్టీ బీజేపీ విలీనంతో ఆ పార్టీ లో చేరారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి విజయం సాధించారు. బీజేపీ అధినాయకత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న సీఎం రమేశ్.. ఇప్పుడు పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.