
పాక్ పై 5 వికెట్ల ఘనత చరిత్ర సృష్టించిన భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా Deepti Sharma : టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆమె 5 వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో దీప్తి తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది.
ఈ క్రమంలో ఆమె థాయిలాండ్ ప్లేయర్ తిపట్చా పుట్టావాంగ్ ను అధిగమించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తిపట్చా పుట్టావాంగ్ 165 వికెట్లు పడగొట్టగా దీప్తి శర్మ 166 వికెట్లను సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లు వీరే..
దీప్తి శర్మ (భారత్) - 145 మ్యాచ్ల్లో 166 వికెట్లు తిపట్చా పుట్టావాంగ్ (థాయ్లాండ్) - 105 మ్యాచ్ల్లో 165 వికెట్లు హెన్రియెట్ ఇషిమ్వే (రువాండ) - 131 మ్యాచ్ల్లో 160 వికెట్లు మేగాన్ షట్ (ఆస్ట్రేలియా) - 125 మ్యాచ్ల్లో 152 వికెట్లు ఓ కమ్చోంఫు (థాయ్లాండ్) - 137 మ్యాచ్ల్లో 148 వికెట్లు ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. స్మృతి మంధాన (68; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా హర్మన్ ప్రీత్ కౌర్ (36; 35 బంతుల్లో 4 ఫోర్లు), రిచా ఘోష్ (34; 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్, ఫాతిమా సనా లు చెరో రెండు వికెట్లు, తస్మియా
రుబాబ్, రామీన్ షమీమ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. *Fatima Sana : ఆ తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా కామెంట్లు.. A historic fifer for a historic milestone! 🫡 Deepti Sharma, take a bow 👏💙 Scorecard ▶️ | #WomenInBlue | #T20WorldCup | @Deepti_Sharma06 — BCCI Women (@BCCIWomen) June 14, 2026 ఆ తరువాత మునీబా అలీ (41; 35 బంతుల్లో 5 ఫోర్లు) రాణించినప్పటికి మిగిలిన ప్లేయర్లు విఫలం కావడంతో 171 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 5 వికెట్లు తీయగా.. శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టింది. షషాలీ వర్మ ఓ వికెట్ సాధించింది.