
వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో రొమాంటిక్, కామెడీ, థ్రిల్లర్ చిత్రాలు ఈ వారం రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. స్టెప్ బ్రదర్, సిస్టర్ ప్రేమలో పడే యువర్ ఫాల్ట్ లండన్ అనే అడల్ట్ మూవీ తో పాటు కొన్ని కామెడీ చిత్రాలు, థ్రిల్లర్ సినిమాలు సందడి చేయబోతున్నాయి.
ఈ వారం ఓటీటీలోకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల కంప్లీట్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు. ఇది అడల్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. నోవా, నిక్ ఇద్దరూ గాఢమైన ప్రేమలో మునిగిపోతారు. కొన్ని సంఘటనల తర్వాత వారిద్దరికి స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్ అని తెలుస్తోంది.
ఆ తర్వాత వీరిద్దరూ తమ ప్రేమని వదులుకున్నారా లేదా అనేది ఈ చిత్ర కథ. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన Drishyam సిరీస్‌కు ముగింపు పలికే భాగం ఇది. మే 21న థియేటర్లలో విడుదలైన ఈ థ్రిల్లర్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అసలు మలయాళ భాషలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
సామాజిక, కుల భేదాల కారణంగా రెండు కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలు ప్రతీకారానికి దారితీస్తాయి. ఒక ప్రేమకథ విఫలమవడంతో మొదలైన పరిణామాలు అందరి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ధవల్ ఠాకూర్, సంచిత బసు ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడు గ్రామం నేపథ్యంలో సాగే గ్రామీణ హాస్య-భావోద్వేగ కథ ఇది.
యోగి బాబు, లవ్లిన్, జార్జ్ మరియన్, రైచల్ రబెక్కా ఫిలిప్ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ప్రేక్షకుల ఆదరణ పొందిన తెలుగు హాస్య వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ మూడో సీజన్‌తో తిరిగి వస్తోంది.
వివాహ జీవితంలో ఎదురయ్యే సమస్యలతో సతమతమవుతున్న ముగ్గురు భర్తల సరదా ప్రయాణం కొత్త సీజన్లో కూడా కొనసాగనుంది. తన కుమారుడి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ తండ్రికి, తన కుమారుడు ఇంకా
బతికే ఉండవచ్చనే ఆధారాలు లభిస్తాయి. నిజం తెలుసుకునేందుకు అతడు జైలు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు. సామ్ వర్తింగ్టన్, బ్రిట్ లోయర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
స్పెయిన్‌లోని విలాసవంతమైన రిసార్ట్‌లో అత్యంత ధనికుల జీవితాల చుట్టూ తిరిగే స్పానిష్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ఒక వ్యక్తి అదృశ్యమైన ఘటనపై దర్యాప్తు ప్రారంభం కావడంతో అందరి ప్రణాళికలు తారుమారవుతాయి.
భార్య మరణం తర్వాత తన 11 ఏళ్ల కుమారుడిని పెంచుతూ జీవితం సాగించే ఓ తండ్రి కథ ఇది. భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రంలో తండ్రి-కొడుకుల అనుబంధాన్ని చూపించనున్నారు.
మాదకద్రవ్యాల ముఠా నాయకుడిని పట్టుకున్న ఓ పోలీసు అధికారి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. అతని మాజీ భార్యను కిడ్నాప్ చేయడంతో ఆమెను రక్షించేందుకు ప్రమాదకరమైన మిషన్ చేపడతాడు. గాంగ్ మ్యుంగ్, జిన్ సన్-క్యూ, కిమ్ జి-సోక్, యూన్ క్యుంగ్-హో ప్రధాన పాత్రల్లో నటించారు.
కళాశాల నేపథ్యంలో సాగే ఈ హాస్య-భావోద్వేగ చిత్రంలో టోవినో థామస్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ మలయాళ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.