
US Iran Peace Deal : అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ఒప్పందంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మళ్లీ తెరుచుకోనుంది. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదిగా పోస్టు చేశారు.
అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆ దేశంపై తమ నావికా దిగ్భందనం ముగుస్తుందని ప్రకటించారు. ‘ప్రపంచంలోని నౌకలు మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుంది’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందపై ఇరాన్ అధికారిక ప్రకటన చేసింది. ఇరాన్ జాతీయ టీవీ ద్వారా ఇరాన్ మిలిటరీ జనరల్ ప్రకటించారు. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరింది. పట్టుదలతో శత్రువును లొంగదీసుకున్నామని పేర్కొంది. యుద్ధంతి మా సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాం.
యుద్ధంలో ఎక్కడా తగ్గకుండా అమెరికా, ఇజ్రాయెల్ ను ఎదుర్కొన్నామని ఇరాన్ పేర్కొంది. మరోవైపు.. శాంతి ఒప్పందం కుదరడంతో ఇరాన్‌కు భారీగా అమెరికా నిధులు విడుదల చేయనుంది. రాబోయే 60 రోజుల్లో 24 బిలియన్ డాలర్లను అమెరికా అన్‌ఫ్రీజ్ చేయనుంది.
అయితే, ఈ నెల 18న స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంకతాలు చేయనున్నాయి. సంతకాలు తరువాత పూర్తిస్థాయి నిబంధనల పత్రాన్ని ఇరు దేశాలు బహిర్గతం చేయనున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో క్రూడాయిల్ ధరలు కుప్పకూలాయి.
4శాతంకుపైగా పతనమై 84 డాలర్లకు బ్రెంట్ క్రూడ్ పడిపోయింది
.