మన వేరు కాపురం సాగర్.. పెళ్లంతో వంట చేయించడం చేతగాక.. బయట నుంచి బర్గర్లు, పిజ్జాలు తెచ్చి తెగ బిల్డప్ ఇస్తుంటాడు. నర్మదా.. ఫ్రెష్ అయ్యి వస్తా.. తిందాం అని లోపలికి వెళ్లి బయటకు వచ్చేసరికి.. నర్మద, ధీరజ్, ప్రేమ, తిరుపతి, వేదవతిలు మొత్తం లాగించేస్తారు.
ఇక ఈరోజు (జూన్ 15) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ‘తాను తెచ్చిన బర్గర్లను అంతా కలిసి లొట్టలేసుకుని లాగించేయడం చూసిన సాగర్.. నర్మదా ఏంటిదీ అంటూ అరుస్తాడు. కలిసి తిందాం అన్నావ్ కదా.. అందరం కలిసి తింటున్నాం’ అని అంటుంది నర్మద.
‘ఒరేయ్ వేరు కాపురం అన్నాయ్.. నువ్వు వేరే కాపురం ఉంటున్నా కూడా.. అందరం కలిసి తిందాం అన్నావ్ చూడూ.. ఆ డైలాగ్‌తో ఎక్కడో టచ్ చేశావ్ రా.. నీ విశాల హృదయానికి థాంక్స్‌రా అన్నాయ్’ అని గాలితీసేస్తాడు ధీరజ్. ‘మీ అన్నయ్య పైకి అలా ఉన్నాడు కానీ..
లోపల బోలెడంత ప్రేమ ఉంటుంది’ అని అంటుంది నర్మద. ఇక ఆపుతావా? అసలు బుద్ది ఉందా నీకు?? నేను చెప్పిందీ మనిద్దరం కలిసితిందాం అని.. అంతేకానీ ముక్కు మొహం తెలియని ఈ సంతతో కలిసి తిందాం అని కాదు’ అని అంటాడు సాగర్.నేను తెచ్చింది తినడానికి సిగ్గులేదేంట్రా..
‘అదేంట్రా అన్నాయ్.. ఆ ముక్క ముందు చెప్పాలి కదారా’ అని అంటాడు ధీరజ్. ఆ మాటతో మండిపడతాడు సాగర్. ఆపరా నీ ఎక్స్ ట్రాలు.. నేను తెచ్చిన ఫుడ్ తినడానికి సిగ్గులేదేంట్రా నీకు? అని అంటాడు. నా అన్నయ్య తెచ్చిన ఫుడ్ తినడానికి నాకెందుకురా సిగ్గు..
సర్లే తిను చాలా బావుంది అని అక్కడున్న బర్గర్‌ని ఇస్తాడు ధీరజ్. దాంతో సాగర్ దాన్ని విసిరికొడతాడు.. అది వెళ్లి అప్పుడే వస్తున్న రామరాజుకి తగులుతుంది. షర్ట్ మొత్తం పాడౌతుంది. దాంతో నర్మద.. ‘సారీ మామయ్యా.. షర్ట్‌పై మరకలు పడ్డాయి..
ఆయన తరుపున నేను క్షమాపణ చెప్తున్నాను’
అని అంటుంది. షర్ట్ది ఏముందమ్మా.. ఉతికితే పోతుంది.. కానీ వీడు వేసిన మరక!! వీడి వల్ల నా పరువు మర్యాదలపైనే మరకలు పడ్డాయి. ఈ షర్ట్‌పై పడ్డ మరకలదేముంది? ఉతికితే పోతుంది. కానీ వీడు అడ్డదారిలో ఉద్యోగం కొనుక్కుని నా గౌరవంపై వేసిన నిందలు అంత తేలిగ్గా పోవు కదా.. అని అంటాడు. ఇక ఆ బర్గర్లను చూస్తూ.. ఉన్నప్పుడు ఇలా ఎగిరెగిరి అడ్డమైన తిండ్లూ తింటే ఆ తరువాత అడుక్కుతినాల్సి వస్తుంది.. ఆవిషయం మీ ఆయనకి అర్థం అయ్యేట్టు చెప్పు అంటూ బాగా గడ్డిపెడతాడు రామరాజు. ఇక సాగర్.. మొహం మాడ్చుకుని లోపలికి వెళ్లిపోతాడు. తెల్లారగానే.. ధీరజ్ మళ్లీ కారు ఎక్కబోతాడు. ఆ కారులో నుంచి దిగిన తిరుపతి.. ఒరేయ్ చిన్నల్లుడూ నాకు కొన్ని లవ్ టిప్స్ కావాలిరా.. వాటితో నా ప్రేయసిని పడేస్తా’ అని అంటాడు. ఒడియమ్మా.. కాక్రోచ్ ప్రేయసినా? ఎవరా దురదృష్టవంతురాలు అని అడుగుతాడు ధీరజ్. ‘ఆమె ఎవరో చెప్తే మీరు షాక్ అయ్యి షేక్ అయిపోతారు.. అని అంటాడు తిరుపతి. దాంతో ధీరజ్.. ‘ఆ దేవుడు ఈ అమ్మాయిలకి అతిలోక సుందరి లాంటి అందంతో పాటు.. అతి భయంకరమైన వాయిస్ ఇచ్చాడు.. దాంతో వాళ్లు ముచ్చెమటలు పట్టిస్తారు. పులిలాంటి మగాడ్ని పులిహోరలో కరివేపాకుని చేస్తారు.. కానీ బొద్దింకను చూస్తే మాత్రం భయపడిపోతారు అని అంటాడు ధీరజ్. ఇంతలో ప్రేమ వచ్చి.. ‘ఏంటీ బొద్దింకా అంటూ ఎగిరి ధీరజ్ చంక ఎక్కేస్తుంది. ఇక చంక ఎక్కగానే... ఒకరికళ్లలో ఒకరు తెగ చూసేసుకుంటారు. పక్కనే తిరుపతి ఉన్నాడనే విషయం కూడా మర్చిపోతారు. అమ్మాయి చంక ఎక్కితే ఆ కిక్కే వేరప్పా ఆహా.. ఏంటే ఇంత బరువు ఉన్నావ్.. బరువున్నా సరే అమ్మాయి చంక ఎక్కితే భలే ఉంటుంది. ఆ ఫీలే వేరు అని అంటాడు ధీరజ్. ఒరేయ్.. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు.. కాస్త గ్యాప్ ఇవ్వండ్రా.. ఈ కాక్రోయ్ కాన్సెప్ట్ నాకు నచ్చేసింది.. పిచ్చెక్కిస్తా’ అని ఆత్రంగా సుకన్య దగ్గరకు పరుగు తీస్తాడు తిరుపతి. ఇక ప్రేమ.. బయటకు వెళ్లేటప్పుడు పెళ్లాన్ని ఎదురు రమ్మనాలిరా.. ఈరోజు నుంచి నీకు లక్కూ ఏ దిక్కునుంచైనా రావచ్చు అంటూ ఎదురొచ్చి ధీరజ్ నుదుటున ముద్దు పెడుతుంది ప్రేమ. హో ముద్దు అక్కడేనా? ఇంకెక్కడా లేదా? అని అంటాడు ధీరజ్. సచ్చినోడా.. కనిపించవు కానీ.. చాలా సెకలు ఉన్నాయ్ రా నీలో’ అని అంటుంది ప్రేమ. ఆహా.. తిరుపతికి బాగా పనైందిగా.. ఇక తిరుపతి ప్లాన్ ప్రకారం ఓ బొద్దింకను పట్టుకుని వెళ్లి.. సుకన్యని భయపెడతాడు. దాంతో సుకన్య.. ప్రేమలాగే ఎగిరి తిరుపతి చంక ఎక్కేస్తుంది. కన్యా.. నా సుకన్య.. నా జలకన్య అంటూ తెగ ముద్దులు పెట్టేస్తుంటాడు. కట్ చేస్తే అది కల అన్నమాట. సుకన్య దగ్గరకు వెళ్లి.. బొద్దింక అని అరుస్తాడు. వామ్మో బొద్దింకా అంటూ ఆ చేతిని గట్టిగా కొడుతుంది సుకన్య. అది కాస్తా ఎగిరి తిరుపతి షర్ట్‌లో పడుతుంది. అచ్చి బాబోయ్ బొద్దింకా.. బొద్దింకా అని అరుస్తాడు తిరుపతి. దాంతో సుకన్య.. ఏంటీ షర్ట్‌లో దూరిందా చెప్తా దాని సంగతి అంటూ చీరుపు తెచ్చి వీరబాదుడు బాదేస్తుంది సుకన్య. దెబ్బ నొప్పులకు మందులు వేసుకోండి అంకుల్ అని కుమ్మిపారేస్తుంది. నా దగ్గరా నీ వేషాలు.. పొలుసు తీసి పులుసు బొద్దింక అంటా.. బొద్దింక.. నా దగ్గరా నీ వేషాలు అని అనుకుంటుంది సుకన్య. అంటే కావాలనే తిరుపతిని కుమ్మిపారేస్తుంది సుకన్య. ఇక శ్రీవల్లి.. సుక్కూ సుక్కూ అని అరుస్తూ.. ‘కడుపులో ఎలుకలు పరుగుపెడుతున్నాయే.. నేను కడుపుతో ఉన్నానే.. టైమ్‌కి తినాలే’ అని అంటుంది. ‘ఏంటీ.. కడుపా?? పాడగా పాడగా రాగం వచ్చినట్టు.. కడుపు క్యారెక్టర్లో జీవించీ జీవించీ నా దగ్గర కూడా ఓవరాక్షన్ చేస్తున్నావా? అని అంటుంది సుకన్య. అంటే.. క్యారెక్టర్లో కంటెంట్ ఉండాలని.. ఇన్వాల్వ్ అయిపోయాను అని అంటుంది శ్రీవల్లి. ‘ఇదిగో మరీ అంత ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోకు.. ఆ నర్మద, ప్రేమలకు దొరికితే పొలుసు తీసి పులుసు పెడతారు’ అని అంటుంది సుకన్య. మా అక్క అసలే కడుపుతో ఉంది.. వాళ్ల మొహం.. పుట్టలో పాము ఉందని కనిపెట్టగలరేమో కానీ.. నా పొట్టలో బిడ్డ లేదని కనిపెట్టాలంటే.. వాళ్ల తల్లో పేలు దిగిరావాలి? డైలాగ్ కొత్తగా ఉందని షాక్ అవ్వొద్దు.. ఏదో పద ప్రయోగం కోసం ట్రై చేశాలే అని అంటుంది శ్రీవల్లి. ఔనా.. ఇదిగో ఉప్మా కూడా కొత్తగా ట్రై చేశా.. కరివేపాపు ఉప్మా.. తిను అని అంటుంది సుకన్య. ఏడ్చినట్టు ఉంది నీ ప్రయోగం అని శ్రీవల్లి అంటే.. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన నర్మద.. ‘నీ వంటలతో మా అక్కని చంపేస్తావా? మా అక్క అసలు కడుపుతో ఉంది.. మా అక్క కోసం స్పెషల్‌గా ఫుడ్ రెడీ చేశాను రా తిను’ అని అంటుంది నర్మద. ‘నాకోసం స్పెషల్‌గా చేశావా? ఏంటదీ అని అంటుంది శ్రీవల్లి. చెప్తే థ్రిల్ ఉండదు అక్కాయ్ పదా తిందువు గానీ అని అంటుంది నర్మద. తొందరపడకే సుందరవదనా.. అచ్చి బాబోయ్ నాకు థ్రిల్ అన్నా.. థ్రిల్లర్ సినిమాలన్నా పిచ్చి.. పదా పదా అంటూ ఆసక్తిగా వెళ్తుంది శ్రీవల్లి. నాకేదో తేడా కొడుతుంది అని సుకన్య అంటే.. ‘తేడా లేదూ.. గీడా లేదు.. వాళ్లు మనకెలా కంత్రీగాళ్లేం కాదు.. నాతో పాటు నువ్వు కూడా రా తిందువు గానీ.. మంచితనంలో వాళ్లు మంచి ముత్యాలు’ అని నర్మద వెంట వెళ్తుంది శ్రీవల్లి. ఇంతలో ప్రేమ.. పెద్ద పళ్లెం తీసుకుని ఎంట్రీ ఇస్తుంది. తన కోసం ఇన్నిరకాల టిపినీలు చేశారా? అంటూ తెగ మురిసిపోతుంది శ్రీవల్లి. ఆనందంతో తెగ స్టెప్లు వేస్తుంది శ్రీవల్లి. ఇంతకీ శ్రీవల్లి కోసం నర్మద, ప్రేమలు చేసిన టిపినీలు ఏంటో తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.