
దొంగలు వదిలేసిన బ్యాగు పరిశీలిస్తున్న పోలీసులు బాపట్ల, న్యూస్టుడే: తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్ట్కు వెళుతున్న సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో దొంగలు చోరీకి పాల్పడగా.. పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది.
ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో బాపట్ల శివారు నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్-3, ఎస్-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల నుంచి ఏడు సవర్ల బంగారు ఆభరణాలు దొంగిలించారు. చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది.
దొంగలు రైలు దిగి పొలాల మీదుగా బాపట్ల-గుంటూరు రోడ్డు వైపు పారిపోతుండగా.. ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగుల కోసం అప్పికట్ల- బత్తిపూడి పొలాల్లో గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేశారు.
ఈ ఘటనలో ఆరుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.