డిజిటల్ తెరపై భార్యాబాధితుల కష్టాలను నవ్వుల పంటగా మార్చి.. వరుసగా రెండు సీజన్లతో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’.
జియో హాట్‌స్టార్‌లో రికార్డు వ్యూస్‌తో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ క్రేజీ సిరీస్, ఇప్పుడు మూడో సీజన్‌తో సందడి చేసేందుకు సిద్ధమైంది. జూన్ 19 నుంచి సరికొత్త ఎపిసోడ్లతో అలరించేందుకు వస్తోన్న నేపథ్యంలో, తాజాగా విడుదల చేసిన ఈ సీజన్-3 ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈసారి కేవలం ఫ్యామిలీ డ్రామానే కాకుండా, సరికొత్త ఫాంటసీ ఎలిమెంట్స్‌తో వినోదాన్ని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ ఎంట్రీ"పెళ్లి అంటే పండు వెన్నెల.. పెళ్లాం అంటే నిండు పున్నమి అని మనకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పారు" అంటూ రాహుల్ పాత్రలో అభినవ్ గోమటం మార్క్ డైలాగ్‌తో ట్రైలర్ చాలా ఫన్నీగా ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగే బార్లో కూర్చుని తమ వైవాహిక జీవితాల్లోని కష్టాలను ఏకరువు పెడుతుంటారు రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (కృష్ణ చైతన్య), ఘంటా రవి ( ప్రియదర్శి ). ఈ క్రమంలో ‘అసలు పెళ్లిళ్లు స్వర్గంలో కుదురుస్తారని చెప్పినవాడు ఎవడో దొరికితే బాగుండు’ అని విక్రమ్ అనడమే ఆలస్యం.. నిజంగానే స్వర్గాధిపతి ఇంద్రుడి గెటప్‌లో వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇవ్వడం ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఊహించని ట్విస్టులుఇంద్రుడి ఎంట్రీ తర్వాత ఈ ముగ్గురు మిత్రుల జీవితాలు ఒక విభిన్నమైన సమాంతర ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. అక్కడ ఎవరూ ఊహించని మార్పులు జరుగుతాయి. నిన్నమొన్నటి వరకు సాధారణ వ్యక్తిగా ఉన్న ఘంటా రవి ఏకంగా ఎమ్మెల్యే అయిపోతాడు. ఇక రైటర్‌గా కష్టాలు పడే రాహుల్ స్టార్ స్క్రీన్ ప్లే రైటర్‌గా మారిపోగా, కార్పొరేట్ ఉద్యోగి అయిన విక్రమ్ ఒక పెద్ద కంపెనీకి సీఈవోగా బాధ్యతలు చేపడతాడు. అసలు తమ జీవితాల్లో ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయో, ఏం జరుగుతుందో అర్థం కాక ఆ ముగ్గురూ అయోమయంలో పడతారు. రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య సాగే ఈ కథలో కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ, ప్రతి సన్నివేశంలోనూ కామెడీ మాత్రం గ్యారెంటీ అని మేకర్స్ హింట్ ఇచ్చారు. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్స్ అవుట్ అండ్ అవుట్ నవ్వులు పూయించేలా ఉన్నాయి. Save The Tigers 3: భార్యా బాధితులకు తోడుగా ఇంద్రుడు.. ‘సేవ్ ది టైగర్స్ 3’ ట్రైలర్ చూశారా! మరోవైపు వీరి భార్యల పాత్రల్లో దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాతలతో పాటు కీలక పాత్రలో రోహిణి తమదైన నటనతో మరోసారి అలరించడానికి సిద్ధమయ్యారు. ఫాంటసీ, ఫన్, రిలేషన్షిప్ డ్రామాలను పక్కాగా మిక్స్ చేసి ఈ మూడో సీజన్‌ను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, గుండు సుదర్శన్, మిర్చి కిరణ్, అభయ్ బేతిగంటి, ముక్కు అవినాష్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ప్రదీప్ అద్వైతం, మహి వి. రాఘవ్ క్రియేటర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్‌ను శివ మేక, సాహితీ చింతలపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఎరగం ఈ సీజన్‌కు దర్శకత్వం వహించగా.. విజయ్ నామోజు, డిఎస్ గౌతమ్ స్క్రిప్ట్ అందించారు. విశ్వేశ్వర్ సిలకోటి కెమెరా పనితనం, అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఎంటర్టైనింగ్గా మార్చాయి. జూన్ 19 నుంచి ఈ నవ్వుల పండగ జియో హాట్‌స్టార్‌లో షురూ కానుంది. భార్యాబాధితుల ఈ సరికొత్త ఫాంటసీ రైడ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి!