
Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమాయక బాలికను ఆర్టీసీ బస్సు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. బంధువుల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, ఎంతో ఇష్టమైన భరతనాట్యం ప్రదర్శన ఇవ్వడానికి బైక్‌పై వెళ్తుండగా.. వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ దారుణ ఘటనలో 13 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. చౌటాకూర్ మండల పరిధిలోని శివ్వంపేట వద్ద 161 జాతీయ రహదారిపై ఈ విషాదం సంభవించింది. పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పుర్ర వైష్ణవి (13) భరతనాట్యం నేర్చుకుంటోంది. పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామంలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వైష్ణవి ఇక్కడికి వచ్చింది. ఆదివారం ఫసల్వాది విద్యాపీఠంలో నిర్వహించ తలపెట్టిన ప్రత్యేక భరతనాట్యం సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వైష్ణవి.. మిన్పూర్ గ్రామానికి చెందిన మరో ముగ్గురు బంధువులతో కలిసి బైక్‌పై బయలుదేరింది. వీరి బైక్ చౌటాకూర్ మండలం శివ్వంపేట వద్ద 161 జాతీయ రహదారిపైకి చేరుకోగానే.. వెనక నుండి అతివేగంగా వచ్చిన టీజీఎస్ ఆర్టీసీ బస్సు వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. బస్సు ఢీకొట్టిన తీవ్రతకు బైక్ పైనుంచి అందరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తలకు తీవ్ర గాయమవ్వడంతో పుర్ర వైష్ణవి రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారంతా మిన్పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘోర ప్రమాద సమాచారం అందుకున్న చౌటాకూర్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. వైష్ణవి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి
ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించి, బస్సును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కళాకారిణిగా ఎదగాల్సిన చిన్నారి కళ్ల ముందే శవమై పడి ఉండటంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఈ ఘటనతో పెద్దాపూర్, మిన్పూర్ గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
E Commerce – ఇ-కామర్స్ డార్క్ ప్యాటర్న్స్ రిపోర్ట్ 2026
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
CJP Protest : హైదరాబాద్ లో ‘కాక్రోచ్’ పార్టీ ఆందోళన..
KTR: మీనాక్షి నటరాజన్‌పై తప్పుడు కేసులు పెట్టించింది రేవంత్ రెడ్డే: కేటీఆర్
Himayat Sagar: భారీ వర్షాల ఎఫెక్ట్.. జంట జలాశయాలకు పెరిగిన వరద నీరు
KTR Vs Revant : రేవంత్ ఆ పని చేస్తే రాజకీయం వదిలేస్తా..కేటీఆర్ సంచలన ప్రకటన
Hanamkonda: హనుమకొండలో ఘోరం: పెళ్లి పేరుతో నమ్మించి.. వివాహితపై ఎస్ఐ అత్యాచారం
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా