
KTR Vs Revant : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాల్-ప్రతిసవాళ్ల పర్వం మరింత హీటెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేరిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (KTR) సంచలన ప్రకటన చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో మహిళలను ఆకట్టుకునేందుకు ఇచ్చిన కీలకమైన ఆర్థిక సహాయం హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విస్మరించిందని, కేవలం మాటలకే పరిమితమైందని ఆయన విమర్శించారు. Read Also ; రేపటి నుంచి ప్రభుత్వ స్కూల్స్ , కాలేజీ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం మరియు ఇతర పద్ధతుల్లో ఐదేళ్ల కాలంలో ఒక్కో ఆడబిడ్డకు దాదాపు రూ. లక్షన్నర అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ హామీని రాబోయే రెండేళ్ల కాలంలోనైనా రేవంత్ రెడ్డి నిజం చేసి చూపిస్తే.. తాను తక్షణమే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. “మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ ఆకాశంలో మాటలు చెప్పడం కాదు.. ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వారిని లక్షాధికారులను చేసి చూపించాలి” అంటూ ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎండగట్టాలని, హామీల అమలుపై కాంగ్రెస్ను నిలదీయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Hanamkonda: హనుమకొండలో ఘోరం: పెళ్లి పేరుతో నమ్మించి.. వివాహితపై ఎస్ఐ అత్యాచారం AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా Earthquake
: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
Breakfast Scheme : రేపటి నుంచి ప్రభుత్వ స్కూల్స్ , కాలేజీ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్
Paddy Procurement : ధాన్యం సేకరణలో రికార్డ్స్ బ్రేక్ చేసిన తెలంగాణ సర్కార్
CJP Protest in Hyderabad : రేపు హైదరాబాద్లో ‘కాక్రోచ్’ నిరసన కు పోలీసుల అనుమతి