
బ్రెజిల్లో తాజాగా జరిగిన ఒక విషాదకర ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బంగీ జంప్ కోసం వెళ్లిన యువతి.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. బ్రెజిల్లో తాజాగా జరిగిన ఒక విషాదకర ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బంగీ జంప్ కోసం వెళ్లిన యువతి.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. సేఫ్టీ రోప్ కట్టకుండానే ఆమెను లోయలోకి విసిరేయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Brazil bungee jump accident). బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలోని లిమీరా ప్రాంతంలో ఉన్నస్కెలెటన్ బ్రిడ్జ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రైటాస్ అనే యువతి బంగీ జంప్ కోసం స్కెలెటన్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లింది. బంగీ జంప్‌నకు ముందు నిర్వాహకులు సేఫ్టీ రోప్‌ను ఆమె కాళ్లకు బిగించడం మరిచిపోయారు. ఇద్దరు వ్యక్తులు ఆ యువతిని తీసుకెళ్లి సుమారు 40 మీటర్ల ఎత్తు నుంచి కిందకు విసిరేశారు. ఆమెను విసిరే క్షణంలో అక్కడున్న కొందరు 'రోప్... రోప్...' అంటూ అరిచారు. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది (safety rope missing). అంత ఎత్తు నుంచి కిందపడిన యువతి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది (Woman dies in Brazil). సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సేఫ్టీ రోప్‌ను కట్టుకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆరుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని.. మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు
..