
వర్షాకాలంలో ఎలుకల బెడదా? ఇదిగో రాత్రికి రాత్రే తరిమికొట్టే ఇంటి చిట్కాలు ఇవే!వర్షాకాలంలో ఎలుకల బెడదా? ఇదిగో రాత్రికి రాత్రే తరిమికొట్టే ఇంటి చిట్కాలు ఇవే! 14 Jun 2026 Anand T వర్షాకాలం వచ్చిందంటే చాలా బయట ఇంట్లో ఎలకల బెడద మొదలవుతుంది. వర్షం కారణంగా అవి నివసించే రంద్రాల్లోకి నీరు చేరడంతో అవి ఇల్లలోకి చేరి నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి రాత్రి వేళల్లో తిరుగుతూ ధాన్యాలు, బట్టలు, పుస్తకాలు, విద్యుత్ తీగలను కొరికేస్తుంటాయి. దీనివల్ల ఇంట్లో భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని వెంటనే ఇంట్లో నుంచి తరిమికొట్టాల్సి ఉంటుంది. ఎలుకలను తరిమేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఇళ్లను వదిలి వెళ్ళకుండా ఉంటే ఇప్పుడు మేం చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించండి. క్షణాల్లో అవి ఇంట్లో నుంచి పారిపోతాయి. మీ ఇంట్లో ఎక్కడైతే ఎలుకలు ఎక్కవగా ఉంటాయో అక్కడ కాస్త పుదీన నూనె పూయడం లేదా పుదీన ఆకుల వేయండి చేయండి. పుదీనా నూనె యొక్క ఘాటైన వాసన ఎలుకలకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆవి మళ్లీ ఆ ప్రదేశంలోకి రావు. ఎలుకలను తరిమికొట్టడంలో మన కిచెన్‌లో దొరికే ఎర్ర కారం, బిర్యానీ ఆకులు, లవంగాల చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటి ఘాటైన వాసనలు ఎలుకలను ఇబ్బందులకు గురిచేసి.. అవి మళ్లీ ఆ ప్రాంతాల్లోకి రాకుండా చేస్తాయి. ఇళ్లలోకి ఎలుకలు రాకుండా ఉండాలంటే గోడలు, తలుపుల సందులు, పైపుల చుట్టూ ఉండే చిన్న చిన్న రంధ్రాలను గుర్తించి వాటిని సరిగ్గా మూసివేయడం చాలా ముఖ్యం. అలాగే ఇంటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార పదార్థాలను ఎల్లప్పుడూ గట్టిగా మూత ఉన్న డబ్బాలలో నిల్వ చేయాలి, తద్వారా ఎలుకలకు తినడానికి ఏమీ దొరకదు. దీంతో అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఎలాంటి ఖరీదైన కెమికల్స్ వాడకుండా, ఈ సులభమైన, చవకైన పద్ధతులను పాటించడం ద్వారా ఎలుకల
బెడద నుండి శాశ్వత ఉపశమనం పొంది, ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్ ఆ పనులు చేసారంటే.. కుజ దోషం దూరం.. త్వరలో పెళ్లి బాజాలు.. చికెన్‌తో ఎముకలు తినే అలవాటు.. మంచిదా.? చెడ్డదా.? భూలోక స్వర్గమే ఈ ప్రాంతం.. విశాఖలో ఈ ప్రదేశాలు మహాద్భుతం..