
కాంచన/ముని సిరీస్ లో రకరకాల పేర్లతో అనేక చిత్రాలు తీశారు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఇప్పుడు ‘కాంచన 4’ (Kanchana 4) తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలుసు. ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ పూజ హెగ్డే నటిస్తోంది అని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం నయనతార (Nayanthara)ని ఒక కీలక పాత్రలో తీసుకోనున్నారట. ఇంతకీ ఈ లేడీ సూపర్ స్టార్ ఈ సినిమాలో నటిస్తుందా? ఏమో చెప్పలేం. రాఘవ లారెన్స్ సరసన నటించేందుకు ఆమె సంశయించొచ్చు. కానీ కీలక పాత్ర అంటే ఆమెకి అభ్యంతరం ఉండకపోవచ్చు. కాంచన సిరీస్ పెద్ద హిట్. “కాంచన 4″తో పాన్ ఇండియా వెళ్ళాలి అనేది లారెన్స్ ప్లాన్. అందుకే ఈ సినిమాలో పెద్ద హీరోయిన్ల కోసం ప్రయత్నిస్తున్నాడు. నయనతార పారితోషికం పదికోట్లపైనే ఉంటుంది. కానీ ఆమె వల్ల ఓటిటి మార్కెట్ కలిసి వస్తుంది. అందుకే లారెన్స్ కీలక పాత్ర కోసం ఆమెని ఒప్పించే విధంగా చర్యలు షురూ చేశాడు. నయనతార ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. ఈ సినిమాని దిల్ రాజ్ నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ సరసన ఒక చిత్రం ఒప్పుకొంది నయనతార. కానీ ఆ సినిమా కథ మారిపోయింది. దాంతో, ఆమె స్థానంలో కాజల్ ని తీసుకున్నారు. సో, ఆమె చేతిలో సల్మాన్ చిత్రం మాత్రమే ఉంది. ఇప్పుడు లారెన్స్ సినిమా సైన్ చేస్తే రెండో భారీ మూవీ అవుతుంది
.