
దేశ ఐటీ రాజధాని బెంగళూరు నడిబొడ్డున ఒక ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా వీధుల్లోకి వచ్చి సామాన్యురాలిలా చీపురుపట్టారు. ఆదివారం బెంగళూరులోని మైసూరు బ్యాంక్ సర్కిల్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ అభియాన్’ కార్యక్రమంలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. కర్ణాటక శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు చలవాడి నారాయణస్వామి, రాష్ట్ర బీజేపీ శ్రేణులతో కలిసి ఆమె ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. కేంద్ర మంత్రి స్వయంగా రోడ్లను శుభ్రం చేయడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటక అంతటా స్వచ్ఛ భారత్ అభియాన్ను అత్యంత అర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర మీడియాకు వెల్లడించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులో మొక్కలను కూడా నాటారు. అనంతరం మధ్యాహ్నం నగరంలోని మేధావులు, ప్రముఖులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని ఆమె ప్రసంగించారు. నెహ్రూ రికార్డు బద్దలు కాబోయే వేళ.. మోదీ అప్రతిహత ప్రస్థానం!గ్లోబల్ సదస్సులో నిర్మలమ్మ గళం.. బెంగళూరు పర్యటనకు ముందు న్యూఢిల్లీ నుండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ విధానంలో జరిగిన అంతర్జాతీయ గ్లోబల్ కన్వర్జెన్స్ ఫర్ గ్రోత్ సమ్మిట్లో పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేయడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై ఈ సదస్సులో కీలక చర్చలు జరిగాయి.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షత వహించిన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో జి7 (G7) దేశాల అగ్రనేతలతో పాటు భారత్, బ్రెజిల్, చైనా, కెన్యా, దక్షిణ కొరియా దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అధిపతులు పాల్గొన్నారు
దేశ ఐటీ రాజధాని బెంగళూరు నడిబొడ్డున ఒక ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా వీధుల్లోకి వచ్చి సామాన్యురాలిలా చీపురుపట్టారు. ఆదివారం బెంగళూరులోని మైసూరు బ్యాంక్ సర్కిల్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ అభియాన్’ కార్యక్రమంలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. కర్ణాటక శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు చలవాడి నారాయణస్వామి, రాష్ట్ర బీజేపీ శ్రేణులతో కలిసి ఆమె ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. కేంద్ర మంత్రి స్వయంగా రోడ్లను శుభ్రం చేయడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటక అంతటా స్వచ్ఛ భారత్ అభియాన్‌ను అత్యంత అర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర మీడియాకు వెల్లడించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులో మొక్కలను కూడా నాటారు. అనంతరం మధ్యాహ్నం నగరంలోని మేధావులు, ప్రముఖులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని ఆమె ప్రసంగించారు. నెహ్రూ రికార్డు బద్దలు కాబోయే వేళ.. మోదీ అప్రతిహత ప్రస్థానం!గ్లోబల్ సదస్సులో నిర్మలమ్మ గళం.. బెంగళూరు పర్యటనకు ముందు న్యూఢిల్లీ నుండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ విధానంలో జరిగిన అంతర్జాతీయ గ్లోబల్ కన్వర్జెన్స్ ఫర్ గ్రోత్ సమ్మిట్లో పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేయడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై ఈ సదస్సులో కీలక చర్చలు జరిగాయి.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షత వహించిన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో జి7 (G7) దేశాల అగ్రనేతలతో పాటు భారత్, బ్రెజిల్, చైనా, కెన్యా, దక్షిణ కొరియా దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అధిపతులు పాల్గొన్నారు. నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు! ముందున్న మూడు పెద్ద గండాలు..ప్రపంచ దేశాల గొడవలకు బలిపశువులవుతున్న పేద దేశాలు!ఈ అంతర్జాతీయ వేదికపై భారత్ తరఫున గళం వినిపించిన నిర్మలా సీతారామన్.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేటి పరస్పర అనుసంధానిత ప్రపంచంలో ఒకచోట వచ్చే సంక్షోభాలు, సవాళ్లు అందరినీ ప్రభావితం చేస్తాయన్నారు.అయితే అగ్రదేశాల మధ్య జరిగే ఘర్షణలు, అనిశ్చితి వల్ల వచ్చే తీవ్ర పరిణామాలు ధనిక దేశాల కంటే.. ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ పైనే పడుతున్నాయని ఆమె బలంగా వాదించారు. ఈ వివక్షను అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో అడుగులు వేయాలని, బహుళ పక్ష సహకారాన్ని బలోపేతం చేస్తూ అందరికీ ప్రయోజనం చేకూర్చే సమగ్ర వృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు.