
ఈ ఒప్పో ఫోన్ సిరీస్‌లో 200MP మెయిన్ కెమెరా ఆప్షన్ 7,000mAh బ్యాటరీతో ఒప్పో రెనో 16 ప్రో రాబోతుంది జూలై 2న భారత మార్కెట్లో ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ Oppo Reno 16 Series : ఒప్పో లవర్స్ కోసం సరికొత్త 5జీ ఫోన్లు రాబోతున్నాయి. వచ్చే నెల జూలైలో భారత మార్కెట్లో ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ కానుంది. కొద్ది వారాల క్రితమే చైనాలో లాంచ్ అయిన ఈ సిరీస్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు, భారత మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. జూలై 2నే ఒప్పో రెనో 16 ఫోన్ రిలీజ్ (Oppo Reno 16 Series) అయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో మే నెలలో చైనాలో ఈ సిరీస్‌ను లాంచ్ చేయగా ఇప్పుడు భారత మార్కెట్లో 200MP మెయిన్ కెమెరా, 7000mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం.. భారత్‌లో ఒప్పో రెనో 16 లాంచ్ డేట్ : భారత మార్కెట్లో ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ ఖరారైనట్లు సమాచారం. ఈ సిరీస్ జూలై 2న భారత మార్కెట్లో లాంచ్ కానుందని ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సిరీస్ షెడ్యూల్ ప్రకారం.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుందని టిప్‌స్టర్ ప్రత్యేకంగా పోస్ట్ చేసింది. అయితే, కంపెనీ నుంచి ఈ ఒప్పో రెనో 16 లాంచ్ డేట్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. EXCLUSIVE: OPPO Reno 16 Series is set to launch in India on July 2, 2026 🇮🇳 The next Reno lineup is just weeks away, with OPPO gearing up to bring its latest smartphones to the
Indian market. More details about the devices, features, and pricing should surface soon. Are you… — Abhishek Yadav (@yabhishekhd) June 12, 2026 Read Also : Top Smartphones 2026 : కొంటే ఇలాంటి ఫోన్లే కొనాలి.. 9000mAh బ్యాటరీతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ ఫోన్లు ఇవే! ఒప్పో రెనో 16 స్పెసిఫికేషన్లు (అంచనా) : గత మేలో చైనాలో ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో వైడ్ రేంజ్ వేరియంట్ ఒప్పో రెనో 16 ప్రో కూడా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,800 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 6.78-అంగుళాల 1.5K రిజల్యూషన్ (1,272 × 2,772 పిక్సెల్స్) అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. భారతీయ వేరియంట్ కూడా ఇలాంటి స్పెసిఫికేషన్లతో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పో ఫోన్ 200MP మెయిన్ కెమెరాతో వస్తుంది. భారతీయ వేరియంట్లో కూడా వస్తుంది. ఒప్పో రెనో 16 ప్రోలో 7,000mAh బ్యాటరీ, ఒప్పో రెనో 16లో 6,700mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లు 80W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి. చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లోని 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో బేస్ మోడల్ ధర CNY 3,499 (సుమారుగా రూ. 49వేలు) నుంచి ప్రారంభమవుతుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో ఒప్పో రెనో 16 ప్రో వేరియంట్ ధర CNY 4,499 (సుమారుగా రూ. 63,000) నుంచి ప్రారంభమవుతుంది.