
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Realme P4R 5G Launched on Flipkart: బడ్జెట్ ధరలు ప్రీమియం ఫీచర్లను కోరుకునే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్ మీ సరికొత్త మొబైల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత యువతను లక్ష్యంగా చేసుకొని కంపెనీ Realme P4R 5Gను మోడల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మోడల్ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన ఆఫర్లతో సందడి చేస్తోంది. ముఖ్యంగా లావెంటర్ కలర్‌తో కూడిన 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చింది.. ప్రస్తుతం Realme P4R 5G మొబైల్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులో ఉంది. అయితే, దీనికి సంబంధించిన సేల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది అంతలోనే దీనిపై కంపెనీ ప్రత్యేకమైన స్పెషల్ తీసుకుంటే ఆఫర్స్ అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి ఇది అత్యంత చీప్ ధరకు లభిస్తోంది. Realme P4R 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది అత్యంత తక్కువ ధరలోనే ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇది భారీ 8000mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి తోడు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం. అలాగే గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన బైపాస్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. సినిమాలు, గేమింగ్ ప్రియుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ
అద్భుతమైన 6.8 అంగుళాలు కలిగిన సన్‌లైట్ డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి రావడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా ఫోటోగ్రఫీకి కూడా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతగానో సహాయపడుతుంది.. ఇందులో వెనక భాగంలో అద్భుతమైన 50 మెగాపిక్సెల్ AI కెమెరాను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పాటు తక్కువ వెలుగులోను అద్భుతమైన పోర్ట్రైట్ షాట్స్ తీసుకునే విధంగా వివిధ రకాల కొత్త కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ఎరైజర్ తో పాటు జాల ప్రత్యేకమైన నెక్స్ట్ ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఫోటో ఎడిటింగ్ మరింత సులభతరం అవుతుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.
మార్కెట్లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ధర MRP రూ.30,999 కాగా.. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో 32 శాతం వరకు ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.20,999 లకే లభించడం విశేషం. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రాగానే దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంకు తోపాటు ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.3 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా అదనంగా దీనిపై కంపెనీ ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్‌తో పాటు అదనపు బోనస్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ వినియోగించడానికి తప్పకుండా మీ దగ్గర వినియోగిస్తున్న ఏదైనా బ్రాండ్ కు సంబంధించిన మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాని కండిషన్‌ను బట్టి, దాని వ్యాల్యూని బట్టి ఏకంగా రూ.16 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ రూ.4,999 లోపే సొంతం చేసుకోవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.