
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Venomous Cobra Snake Belt Video: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రైతులతో పాటు వ్యూస్ కోసం కొందరు యువకులు ఎంతటి తెగింపుకైనా వెనకాడడం లేదు.. ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రమాదకరమైన స్టంట్లను చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. సాధారణంగా పురుషులు ప్యాంట్లు జారిపోకుండా ఉండేందుకు రకరకాల లెదర్ బెల్ట్‌లను వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు ఏకంగా బ్రతికి ఉన్న ఒక ప్రమాదకరమైన నాగుపామును తన ప్యాంటుకు బెల్టుల చుట్టుకున్నాడు. విశ్వ సర్పం నడుము చుట్టూ కదులుతున్న.. ఆ యువకుడు మాత్రం భయం లేకుండా కెమెరాకు ఫోజులు ఇవ్వడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. అసలేం జరిగిందంటే..? వైరల్ అవుతున్న వీడియో వివరాల ప్రకారం.. ఒక యువకుడు రోడ్డు పక్కన నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. అతడి ప్యాంటు నడుము భాగాన్ని గమనిస్తే.. ఎవరికైనా గుండె ఆగినంత పనవ్వాల్సిందే.. ఒక పెద్ద నాగుపామును అతడు బెల్టు లాగా నడుముకు చుట్టుకున్నాడు.. ఆ పాము తలభాగంతో పాటు తోక భాగం బయటకు కనిపిస్తూ కదులుతున్నాయి. ఆ నాగుపాము ఏ క్షణంలోనైనా కాటు వేసే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఆ యువకుడు మాత్రం చాలా కూల్‌గా రోడ్డుపైనే నిలబడి ఉండిపోయాడు.. పక్కనే ఉన్న కొందరు ఈ దృశ్యాలని తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది
కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది..
అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. వ్యూస్ కోసం ఇంత పిచ్చా? ఒకవేళ అది కాటు వేస్తే ప్రాణాలు పోతాయని తెలీదా? ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమందిని సోషల్ మీడియా వినియోగదారులు కోరుతున్నారు.. ఎక్కువమంది సోషల్ నెటిజన్ల అయితే ఈ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది ఫ్యాషన్ కాదు ముమ్మాటికి పిచ్చితనం అంటూ.. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు..
ఇక మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులైతే.. బ్రతికున్న పామును అలా హింసించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైన సర్పంచ్ స్టంట్ లు చేయడం చట్టరీత్య నేరమని పలువురు గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ వీడియో ఎక్కడ జరిగిందో గుర్తించి.. సదరు యువకుడిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి.. కఠినంగా శిక్షించాలని అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులను సోషల్ మీడియా వేదికగా కొంతమంది కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో ఇంస్టాగ్రామ్లో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది. పోస్ట్ చేసి చాలా రోజులైనప్పటికీ ఇప్పుడు వైరల్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.