
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Peddi Collection Day 10: బాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. వీక్ డేస్‌లో కాస్త నిలకడగా సాగినా, వీకెండ్స్ వచ్చేసరికి బాక్సాఫీస్ వద్ద చరణ్ సినిమా దుమ్మురేపుతోంది. తాజాగా ఈ చిత్రం విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం అధికారిక కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేసింది. 10 రోజుల్లో రూ.378 కోట్లు..! విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న 'పెద్ది'.. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండో వీకెండ్ లో భాగంగా నిన్న శనివారం (జూన్ 13) ఒక్క రోజే ఈ సినిమాకు రూ. 12 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈరోజు ఆదివారం (జూన్ 14) సెలవు దినం కావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. నేటితో ఈ కలెక్షన్ల గ్రాఫ్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ (విదేశాల్లో) కూడా 'పెద్ది' చిత్రానికి భారీగా వసూళ్లు వస్తున్నాయి. సినిమా ప్రత్యేకతలు.. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. సినిమాలో క్రికెటర్ గా, రెజ్లర్
గా, రన్నర్‌గా రామ్ చరణ్ చూపించిన వేరియేషన్స్, అద్భుత నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, అప్పల సూరి పాత్రలో జగపతి బాబు నటనకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, సత్య తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించాయి.
వృద్ధి సినిమాస్ సమర్పణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ 'మైత్రీ మూవీ మేకర్స్', 'సుకుమార్ రైటింగ్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించాయి. రామ్ చరణ్ కెరీర్లోనే ఇదొక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.