
Vijay-Rashmika: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణ సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. సరికొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ దేవరకొండ తండ్రి జన్మస్థలమైన తెలంగాణలోని అచ్చంపేట మండల విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు అండగా నిలబడతామని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “మా నాన్నగారు పుట్టిన చిన్న పల్లెటూరు ‘తుమ్మనపేట’కు బయలుదేరాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో నేను, రష్మిక ఒక చిన్న కలను కన్నాం. అచ్చంపేట మండలంలోని 9, 10వ తరగతి విద్యార్థులను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించడమే మా లక్ష్యం” అంటూ విజయ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌ను రష్మిక రీషేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. Read also: Drishyam 3 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న దృశ్యం 3 ..ఎప్పుడంటే? ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంట, సమాజ సేవలోనూ కలిసే ముందడుగు వేస్తున్నారు. ‘దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా తుమ్మనపేట పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9, 10వ తరగతి విద్యార్థుల చదువుల బాధ్యతను వీరు తీసుకున్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల స్కూల్ ఫీజులు చెల్లించడంతో పాటు, వారికి అవసరమైన నోట్‌బుక్స్, స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందించనున్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణ జంటగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. 1850ల నాటి చారిత్రక
సంఘటనల నేపథ్యంలో ఒక పీరియడ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన, అలాగే బ్రిటిష్ వారు తప్పుగా ప్రచారం చేసిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథను రూపొందిస్తున్నట్లు సమాచారం.
Banakacherla Project: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు రిటైర్డ్ ఇంజనీర్ల మద్దతు.. సీఎం చంద్రబాబుకు లేఖ
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
aaranasi Movie : వైజాగ్ లో ‘వారణాసి’ షూటింగ్
Sonu Sood: వందే భారత్‌లో ప్రయాణించిన సోనూ సూద్.. గతాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం!
Peddi : ‘పెద్ది’ టీమ్ ను అభినందించిన మెగాస్టార్
Venky-ANil Ravipudi Movie : వెంకీ-అనిల్ సినిమాకు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్
Prabhas New Movie : బాహుబలితో ‘ధురంధర్’ డైరెక్టర్ సినిమా?
Bigg Boss 10 Agnipariksha Auditions: బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష ప్రారంభం.. ఆడిషన్స్ డేట్స్ ఇవే!