మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం, టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ రాబట్టింది. ఫస్ట్ వీక్ లో స్థిరమైన వసూళ్లను నమోదు చేసింది. సక్సెస్ ఫుల్ గా రెండో వారాంతంలో అడుగుపెట్టింది. తాజాగా పెద్ది మూవీ 10 రోజుల కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.‘పెద్ది’ సినిమా జూన్ 4వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు రూ.135 కోట్లకు పైగా వసూలు చేసింది. 9 రోజుల్లో రూ.366 కోట్లు రాబట్టి, 2026లో నెం.1 సౌత్ ఇండియా గ్రాసర్ గా నిలిచిందని చిత్ర బృందం ప్రకటించింది. అన్నీ కలుపుకొని 10 రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.378 కోట్ల వసూళ్లు సాధించించిందని అఫిషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీని ప్రకారం రెండో శనివారం ఈ సినిమాకి రూ.12 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఎలాగూ ఆదివారం హాలిడే ఉంది కాబట్టి, మంచి నంబర్స్ వస్తాయని మేకర్స్ ఆశిస్తున్నారు.* కేరళలో ‘పెద్ది’ ఓపెనింగ్స్‌ను క్రాస్ చేసిన ‘హ్యాపీ’ రీ-రిలీజ్ కలెక్షన్స్2026లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాగా కరుప్పు (వీరభద్రుడు) టాప్ లో ఉండగా.. ఇప్పుడు పెద్ది మూవీ దాన్ని అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ సినిమా మంచి ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, ఇతర ఏరియాల్లో ఆశించిన విధంగా కలెక్షన్ నమోదవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో పెద్దికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అలానే హిందీలోనూ ఈ చిత్రానికి అనుకున్నంత ఆదరణ దక్కలేదని వసూళ్లు చూస్తే అర్థమవుతుంది. ఇప్పట్లో మరే ఇతర క్రేజీ మూవీ రిలీజ్ లేదు కనుక, లాంగ్ రన్ లో ఈ సినిమాకి భారీ ఫిగర్స్ వస్తాయని అభిమానులు ధీమా
వ్యక్తం చేస్తున్నారు.* ‘దంగల్’ కంటే ‘పెద్ది’ సినిమాకే ఎక్కువ ఆదరణ ఉంటుంది: చిరంజీవిగ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా పెద్ది చిత్రం తెరకెక్కిందింది. రామ్ చరణ్ నటన, పాత్ర కోసం తనని తాను మార్చుకున్న తీరు ప్రేక్షకులను మెప్పించాయి. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించగా.. ఆమె పోషించిన అచ్చియమ్మ పాత్రను చూపించిన విధానంపై విమర్శలు వచ్చాయి. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ పాత్రలకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ పాన్ ఇండియా చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.