
ప్రకృతి రమణీయత మధ్య ప్రవహించే నదీ.. ఆ నది మధ్యలో సహజంగా ఏర్పడిన శిలలూ.. వాటిపైన చెక్కిన శివలింగాలూ - నంది రూపాలూ.. నీళ్లే సహజంగా అభిషేకం చేస్తున్న తీరూ, కాస్త ఓపిక ఉండి లెక్కిస్తే వెయ్యివరకూ ఉండే శివయ్య రూపాలు.. భక్తులను తన్మయత్వంలో ముంచుతాయి. ఈ అందాలన్నీ చూడాలనుకుంటే సహస్రలింగ క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిందే. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, సిర్సీ పట్టణానికి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉండే శాల్మలా నదిలో శివయ్య వెయ్యి చోట్ల కొలువుదీరాడు. నది మధ్యలో.. సహస్రలింగాలు
|