
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాతో ఒప్పందం (peace deal with USA) విషయంలో ఇరాన్ సానుకూలంగా స్పందించడంపై అక్కడి ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. భారీ ఎత్తున నిరసన చేపట్టారు. మషద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెలుపల నిలబడి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి వ్యతిరేకింగా నినాదాలు చేశారు. అరాగ్చీతో పాటు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ పదవి నుంచి తక్షణమే దిగిపోవాలని డిమాండ్ చేశారు. అమెరికాతో చేసుకుంటున్న ఈ ఒప్పందం దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని.. హర్మూజ్‌పై టెహ్రాన్‌కు ఉన్న నియంత్రణను హరించివేస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అరాగ్చీ (Abbas Araghchi) మాట్లాడుతూ.. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధం ముగించే ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయడానికి అమెరికా-ఇరాన్ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. హర్మూజ్‌ను తాము తెరవాలంటే.. ఇరాన్‌లోని ఓడరేవులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఒప్పందంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఇదీ చదవండి: ఆదివారమే ఇరాన్‌తో ఒప్పందం: ట్రంప్ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.